2025 సంవత్సరంలో అనేక గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. రానున్న కొత్త సంవత్సరంలో అనేక గ్రహాల సంయోగం ఏర్పడనున్నాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో సంచరిస్తున్నప్పుడు ఏర్పడే పరిస్థితిని గ్రహ సంయోగం అంటారు. గ్రహ సంయోగం ఏర్పడినప్పుడు.. మొత్తం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. వేద పంచాంగం ప్రకారం, 2025 సంవత్సరంలో రెండు స్నేహపూర్వక గ్రహాలు కలయిక జరగనుంది.
వైద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సుమారు 30 సంవత్సరాల తరువాత శనీశ్వరుడు , బుధుడు కుంభరాశిలో కలవనున్నారు. కుంభరాశిలో శనీశ్వర, బుధ గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. కొన్ని రాశుల వ్యక్తులు 2025 సంవత్సరంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. శుభవార్తలను కూడా అందుకుంటారు. ఈ రోజు కొత్త ఏడాదిలో శుభ ఫలితాలను అందుకోనున్న అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి వారికి 2025 సంవత్సరం ప్రారంభంలో బుధుడు , శని గ్రహాల కలయిక కొన్ని భారీ ప్రయోజనాలను అందిస్తుంది. మేష రాశి వారికి కొత్త సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మేషం రాశి వారికి కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. వీరికి ఆర్థిక స్థితి గతం కంటే బలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఈ సమయంలో అదృష్టం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది.
మకర రాశి: 2025 సంవత్సరం ప్రారంభంలో బుధుడు, శనీశ్వర గ్రహాల కలయిక మకర రాశి వారికి మంచి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కాలంలో మకర రాశికి చెందిన వ్యక్తులు కార్యాలయంలో విజయం సాధిస్తారు. అలాగే ప్రణాళికలతో జీవితంలో ముందుకు వెళ్తారు. కొత్త ఏడాదిలో వీరు సమాజంలో గొప్ప వ్యక్తులతో సంబంధాలను పెంచుకుంటారు. మకర రాశి వారు ఎవరికైనా రుణం ఇచ్చినట్లయితే.. ఈ సమయంలో తిరిగి పొందుతారు. బుధుడు,శనీశ్వర కలయిక మకర రాశి వారికి కోర్టు కేసులలో విజయాన్ని ఇస్తుంది. కొత్త ఏడాదిలో వీరికి అన్నీ శుభాలే కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
కుంభ రాశి: బుధుడు, శనీశ్వర కలయిక కుంభ రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభ రాశి వ్యక్తులు 2025 సంవత్సరంలో ఆర్థిక లాభం పొందుతారు. అదృష్టం వారి వైపు ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెరగడంతో పాటు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో ప్రశంసలను అందుకుంటారు. వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. మొత్తంమీద కుంభరాశిలో బుధుడు, శనీశ్వర కలయిక వీరికి విజయాన్ని ఇస్తుంది.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.