Money Astrology: మూడు కీలక గ్రహాల అనుకూలత.. ఏడాది చివరి వరకు ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!

| Edited By: Janardhan Veluru

Aug 15, 2024 | 9:58 PM

Money Astrology 2024: ధనానికి, ప్రణాళికకు, శ్రమకు సంబంధించిన గురు, శుక్ర, బుధుల అనుకూలత కారణంగా ఆరు రాశులవారిలో ధనాకర్షణ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశులకు కొద్ది శ్రమతో గానీ, అప్రయత్నంగా గానీ ధనాదాయం బాగా పెరిగే అవకాశం ఈ నెల 16 తర్వాత నుంచి ఈ ఏడాది పూర్తయ్యేలోగా ఏర్పడుతోంది.ఆకస్మిక ధన లాభం, అప్రయత్న ధన లాభం, జీతభత్యాలు పెరగడం, లాభాలు వృద్ధి చెందడం, రావలసిన డబ్బంతా ఒకేసారి అందడం వంటివి జరిగే సూచనలున్నాయి.

Money Astrology: మూడు కీలక గ్రహాల అనుకూలత.. ఏడాది చివరి వరకు ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
Lakshmi Kataksha
Follow us on

ధనానికి, ప్రణాళికకు, శ్రమకు సంబంధించిన గురు, శుక్ర, బుధుల అనుకూలత కారణంగా ఆరు రాశులవారిలో ధనాకర్షణ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశులకు కొద్ది శ్రమతో గానీ, అప్రయత్నంగా గానీ ధనాదాయం బాగా పెరిగే అవకాశం ఈ నెల 16 తర్వాత నుంచి ఈ ఏడాది పూర్తయ్యేలోగా ఏర్పడుతోంది. ఇందులో మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులున్నాయి. ఆకస్మిక ధన లాభం, అప్రయత్న ధన లాభం, జీతభత్యాలు పెరగడం, లాభాలు వృద్ధి చెందడం, రావలసిన డబ్బంతా ఒకేసారి అందడం వంటివి జరిగే సూచనలున్నాయి. మొత్తం మీద ఏదో విధంగా వీరికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న గురువు కారణంగానేకాకుండా, చతుర్థ, పంచమస్థానాల్లో సంచరించే బుధ, గురు గ్రహాల వల్ల కూడా అపార ధన లాభం కలగబోతోంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. వీటికి తోడు లాభస్థానంలో లాభాధిపతి శనే ఉన్నందువల్ల ఉద్యోగంలో జీతాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడం వంటివి కూడా చోటు చేసుకుంటాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. అనుకోకుండా విలువైన ఆస్తి కలిసి వస్తుంది. సంపదకు ఏమాత్రం లోటుండదు.
  2. వృషభం: ఈ రాశిలో ఈ యేడాదంతా గురువు సంచారం, రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం వల్ల అతి కొద్ది శ్రమతో అత్యధికంగా ధన లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. దశమ స్థానంలో దశమాధిపతి శని వల్ల ఉద్యోగం పోవడం, ఉద్యోగంలో పురోగతి లేకపోవడం వంటి వేవీ ఉండకపోవచ్చు. ఫలితంగా వీరి ఆదాయానికి లోటుండదు. జీతభత్యాలు, లాభాలు, అదనపు రాబడి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. బ్యాంక్ బ్యాలెన్స్ తప్పకుండా వృద్ధి చెందుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి లాభస్థానంలో గురు, కుజులు, ధన స్థానంలో బుధ, శుక్రుల వల్ల వీరు తేలికగా ధనాన్ని ఆకట్టుకోగలుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరి స్తాయి. లాభదాయక పరిచయాలు, లాభదాయక ప్రయాణాలతో బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. అప్రయత్న ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలు వైన ఆస్తి దక్కడం, పిత్రార్జితం లభించడం వంటివి కూడా జరుగుతాయి. బాగా పొదుపు పాటిస్తారు.
  4. తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు భాగ్యాధిపతి బుధుడితో కలిసి చాలా కాలంపాటు సంచారం చేసే అవకాశం ఉన్నందువల్ల విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా పడుతుంది. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు మరింతగా సంపద కూడగట్టుకునే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి విలువైన ఆస్తులు సంక్రమించే అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ధన లాభం ఉంటుంది.
  5. వృశ్చికం: ఈ రాశివారికి రాశ్యధిపతి కుజుడు ధన స్థానాధిపతి గురువుతో ఎక్కువ కాలం కలిసి ఉంటు న్నం దువల్ల, ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వీరు ఎటువంటి ఆదాయ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురో గతికి, శీఘ్ర ధనాభివృద్ధికి బాగా అవకాశం ఉంది. చిన్న ప్రయత్నంతో అధిక లాభాలు గడిస్తారు. వ్యాపారాల్లో కూడా లాభాలు అంచనాలను మించుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.
  6. మకరం: ఈ ఏడాదంతా వీరికి ధనాకర్షణకు బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలను సంపాదించగలుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, రాబడి అంచనాలకు మించి వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. షేర్ల వ్యాపారం, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆదాయం వృద్ధి విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిం చడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ క్రమంగా పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి.