Kuja Blessings: మృగశిరలో కుజుడు..కెరీర్, ఆర్థిక విషయాల్లో వారికి విశేష పురోగతి..!

జూలై 23 నుంచి ఆగస్టు 12 వరకు కుజుడు తన సొంత నక్షత్రమైన మృగశిరలో సంచరించనున్నాడు. దీంతో కుజుడి బలం పెరిగి చొరవ, ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, కార్యసిద్ధి యోగాలు బలపడనున్నాయి. ముఖ్యంగా మేషం, సింహం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి ఈ కాలంలో కెరీర్, ఆర్థిక, వ్యక్తిగత జీవితాల్లో విశేష పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Kuja Blessings: మృగశిరలో కుజుడు..కెరీర్, ఆర్థిక విషయాల్లో వారికి విశేష పురోగతి..!
Mars Transit In Mrigashira Nakshatra

Edited By:

Updated on: Jul 22, 2026 | 7:23 PM

వృషభ, మిథున రాశుల్లో విస్తరించి ఉన్న మృగశిరా నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ నెల(జూలై) 23 నుంచి ఆగస్టు 12 వరకు కుజుడు తన సొంత నక్షత్రంలో సంచారం చేయడం జరుగుతుంది. సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు సహజంగానే కుజుడికి బలం పెరుగుతుంది. కుజుడికి బలం పెరగడమంటే చొరవ, ప్రయత్నం, సాహసం, తెగువ, ఆత్మవిశ్వాసం, పోరాట స్ఫూర్తి పెరగడమని అర్థం. ప్రస్తుతం కుజుడికి అనుకూలంగా ఉన్న రాశుల వారిలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనుకున్నది సాధించాలనే తపన వృద్ధి చెందుతుంది. పట్టుదల పెరుగుతుంది. మేషం, సింహం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు కుజ బలం వల్ల అనుకున్నది సాధిస్తారు.

మేషం

రాశినాథుడైన కుజుడు ద్వితీయ, తృతీయ స్థానాల్లో సొంత నక్షత్రమైన మృగశిరలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారిలో అధికారం చేపట్టాలనే కోరిక బాగా పెరుగుతుంది. అధికారానికి అవకాశం ఉన్న సంస్థలోకి మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకుంటారు. వ్యవహార శైలిలో మార్పు వస్తుంది. ఒక ప్రణాళిక ప్రకారం తన ఆశలను నెరవేర్చుకుంటారు.. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

సింహం

ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో కుజుడు సంచారం చేయడం వల్ల ఈ రాశివారు కొత్త ఆశయాలు, లక్ష్యాలతో పురోగమిస్తారు. అధికారం చేపట్టడం మీదా, ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడం మీదా వీరు తమ శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరించి విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలను పరిష్కరించు కోవడానికి, సొంత ఇంటిని అమర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త మార్పులు చేపడతారు. ముఖ్యమైన సమస్యల్ని పరిష్కరించుకుంటారు.

ఇవి కూడా చదవండి

తుల

ఈ రాశికి ధన, సప్తమాధిపతి అయిన కుజుడు తన సొంత నక్షత్రమైన మృగశిరలో సంచారం చేయడం వల్ల పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అయి సంపన్న కుటుంబంతో సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అదనపు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం విజయవంతం అవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను, వివాదాలను చక్కబెడతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడానికి అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి..

ధనుస్సు

పంచమ, వ్యయాధిపతిగా ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి ప్రయత్నాలు పూర్తిగా సక్సెస్ అవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభిస్తాయి. అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయో గపడతాయి.. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

కుంభం

ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల్లో సొంత నక్షత్రమైన మృగశిరలో సంచారం చేస్తున్న కుజుడి వల్ల ఈ రాశివారికి అధికార యోగం పట్టడంతో పాటు ఆదాయం కూడా బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. రావలసిన డబ్బు, రాదనుకున్న డబ్బు పూర్తిగా వసూలవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో బయటపడతారు.. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. సొంత ఇంటి కల తప్పకుండా సఫలమవుతుంది..

మీనం

ఈ రాశికి ధన, భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన కుజుడు తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం చేయడం వల్ల జీవితంలో కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగానే కాక, ఆధ్యాత్మికంగా కూడా ఊహించని పురోగతి సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. సొంత ఇల్లు, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి.. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి.

Also Read: గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!

Loading...
Unable to load recommendations.
Follow Us