Zodiac Signs: రెండు మహాపురుష యోగాలు.. ఆ రాశుల వారికి అపార ధనలాభం, కీర్తి ప్రతిష్టలు..!

| Edited By: Janardhan Veluru

Nov 18, 2023 | 6:33 PM

గురు, శని, కుజ, బుధ, శుక్ర గ్రహాలు 1,4,7,10 స్థానాలలో (కేంద్ర స్థానాలలో) ఉండడం, వాటిలో దేనికైనా ఉచ్ఛ పట్టడం గానీ అవి స్వస్థానాల్లో ఉండడం గానీ జరిగినప్పుడు మహాపురుష యోగాలు ఏర్పడతాయి. ఇందులో శనీశ్వరుడు కేంద్ర స్థానాల్లో ఉచ్ఛ లేదా స్వస్థానాల్లో ఉన్నప్పుడు శశ మహాపురుష యోగం, అదే విధంగా కుజుడు కేంద్ర స్థానాల్లో ఉచ్ఛ, స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు రుచక మహాపురుష యోగం పట్టడం జరుగుతుంది.

Zodiac Signs: రెండు మహాపురుష యోగాలు.. ఆ రాశుల వారికి అపార ధనలాభం, కీర్తి ప్రతిష్టలు..!
Mahapurusha Raja Yoga
Follow us on

గ్రహ సంచారంలో అనుకోకుండా రెండు మహాపురుష రాజ యోగాలు ఏర్పడ్డాయి. గురు, శని, కుజ, బుధ, శుక్ర గ్రహాలు 1,4,7,10 స్థానాలలో (కేంద్ర స్థానాలలో) ఉండడం, వాటిలో దేనికైనా ఉచ్ఛ పట్టడం గానీ అవి స్వస్థానాల్లో ఉండడం గానీ జరిగినప్పుడు మహాపురుష యోగాలు ఏర్పడతాయి. ఇందులో శనీశ్వరుడు కేంద్ర స్థానాల్లో ఉచ్ఛ లేదా స్వస్థానాల్లో ఉన్నప్పుడు శశ మహాపురుష యోగం, అదే విధంగా కుజుడు కేంద్ర స్థానాల్లో ఉచ్ఛ, స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు రుచక మహాపురుష యోగం పట్టడం జరుగుతుంది. ఈ యోగాలు పట్టినవారు తమ తమ రంగాల్లో తప్పకుండా ఉన్న తమ స్థానాలకు వెళ్లడం, అపార ధనలాభం కలగడం, కీర్తి ప్రతిష్టలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ఈ అయిదు మహాపురుష యోగాల్లో ఒక యోగం ఏర్పడడమే గగనం అనుకుంటే, ఈ సారి నాలుగు రాశుల వారికి ఏకంగా రెండు మహాపురుష యోగాలు ఏర్పడడం ఒక గొప్ప అదృష్టమని చెప్పవచ్చు. శశ, రుచక మహాపురుష యోగాలు రెండూ ఒకేసారి వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు ఏర్పడడం విశేషం. ఒక విధంగా నాలుగు రాశులకు ఇది డబుల్ ధమాకా అని చెప్పవచ్చు.

  1. వృషభం: ఈ రాశివారికి దశమ కేంద్రంలో శనీశ్వరుడు, సప్తమ కేంద్రంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా శశ మహా పురుష యోగం, రుచక మహాపురుష యోగం ఏర్పడ్డాయి. శశ యోగం వల్ల కీర్తి ప్రతి ష్టలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ రాశి వారే ఉన్నత స్థాయి వ్యక్తుల కోవలో చేరిపోయే అవకాశం ఉంటుంది. ఏవైనా గొప్ప పనులు చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం ఏర్పడుతుంది. ఇక రుచక యోగం వల్ల సామా జిక హోదా పెరగడంతో పాటు అపార ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  2. సింహం: ఈ రాశికి సప్తమ కేంద్రంలో శనీశ్వరుడి వల్ల శశ యోగం, చతుర్థ కేంద్రంలో కుజుడి వల్ల రుచక యోగం ఏర్పడడం జరిగింది. శశ యోగం వల్ల రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. రాజ కీయాల్లో ఉన్నవారు అందలాలు ఎక్కడం, అధికారానికి రావడం వంటివి జరుగుతాయి. బాగా జనాకర్షణ ఏర్పడుతుంది. ప్రజా సంబంధాల రంగంలో ఉన్నవారికి ప్రాధాన్యం, ప్రాభవం పెరుగు తాయి. ఇక రుచక యోగం పట్టిన కారణంగా గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడడం, సామాజిక హోదా పెరగడం, వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టడం వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి.
  3. వృశ్చికం: ఈ రాశి కేంద్రంలో కుజుడు ప్రవేశించడం వల్ల రుచక యోగం, చతుర్థ కేంద్రంలో శనీశ్వరుడి సంచారం వల్ల శశ యోగం ఏర్పడ్డాయి. రుచక యోగ ఫలితంగా వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతి, ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం, ఆకస్మిక ధన లాభం, నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు రావడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలోనే కాకుండా, ఆర్థికంగా కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. శశ యోగం కారణంగా, సామాజిక హోదా పెరగడం, ప్రముఖులతో పరిచ యాలు పెరగడం, ప్రముఖ వ్యక్తుల స్థాయికి చేరుకోవడం వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి.
  4. కుంభం: ఈ రాశి కేంద్రంలో శనీశ్వరుడి సంచారం వల్ల శశ యోగం, దశమ కేంద్రంలో కుజుడి సంచారం వల్ల రుచక యోగం ఏర్పడ్డాయి. వీటి వల్ల ఈ రాశివారికి అపారమైన ధన లాభం కలగడంతో పాటు కీర్తి ప్రతిష్ఠలు బాగా ఇనుమడిస్తాయి. పని చేస్తున్న సంస్థల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికార యోగం పడుతుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల్లో ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా వేగం పుంజుకుంటాయి.