Guru Gochar 2026: జూన్ నుండి ఆ రాశుల వారికి గోల్డెన్ డేస్..! అపార ధనం, కీర్తి..

Jupiter Transit 2026: జూన్ 2వ తేదీన గురు గ్రహం తనకు స్వక్షేత్రమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ శక్తివంతమైన గోచార మార్పు వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది. ఓ రకంగా గోల్డన్ డేస్ మొదలయ్యాయని చెప్పవచ్చు. ఈ రాశుల వారికి లక్ష్మీ దేవి అనుగ్రహంతో అపారమైన ధనలాభం, కెరీర్‌లో ఊహించని సక్సెస్ లభించనున్నాయి. ఏయే రాశుల వారికి అదృష్టం పట్టబోతోందో ఇప్పుడు చూద్దాం..

Guru Gochar 2026: జూన్ నుండి ఆ రాశుల వారికి గోల్డెన్ డేస్..! అపార ధనం, కీర్తి..
Guru Gochar 2026 Golden Days

Edited By:

Updated on: May 22, 2026 | 1:30 PM

జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహ సంచారాన్ని అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తారు. గురు భగవానుడి అనుగ్రహం ఏ రాశికి ఉంటే.. వారి జీవితాల్లో ఎన్నో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. సాధారణంగా గురువు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడానికి 12 నెలల సమయం పడుతుంది. ఈ క్రమంలో 2026 జూన్ నెలలో ఒక ముఖ్యమైన గురు సంచారం జరగబోతోంది. ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు, 2026 జూన్ 2వ తేదీ నుంచి తన స్వక్షేత్రం/ఉచ్ఛ క్షేత్రమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ గురు గ్రహం రాశి మార్పు కారణంగా ప్రధానంగా 3 రాశుల వారికి అదృష్టం వరించడమే కాకుండా, ఊహించని సంపద లభిస్తుంది. ఆ మూడు రాశులు ఏవేవో ఇప్పుడు చూద్దాం..

  1. మేష రాశి (Aries): గురు గ్రహ రాశి మార్పు మేష రాశి వారికి అపారమైన అదృష్టాన్ని, సంపదను తెచ్చిపెడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతం అవుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న చిన్నచిన్న సమస్యలు తొలగిపోతాయి. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. పాత అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. వ్యాపారంలో ఆశించని లాభాలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న విభేదాలు సమసిపోతాయి. తోబుట్టువుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు మెరుగవుతాయి.
  2. కర్కాటక రాశి (Cancer): గురువు స్వక్షేత్ర సంచారంతో ఉద్యోగులకు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆఫీసులో అదనపు బాధ్యతలు, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. ఈ కాలంలో మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు బాగా పెరుగుతాయి.
  3. వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశి వారికి ఈ గురు సంచారం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. గురువు మీ రాశి నుండి 9వ స్థానంలో (భాగ్య స్థానంలో) సంచరిస్తాడు. 9వ ఇల్లు అదృష్టం, సంపద, ఉన్నత పదవులను సూచిస్తుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులకు ఆటంకాలు తొలగిపోయి విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు దక్కుతాయి. వ్యాపారంలో ఊహించని పురోగతి, లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. సంతానం నుండి మంచి వార్తలు వింటారు. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం లభిస్తుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది.
ఇవి కూడా చదవండి
Loading...
Unable to load recommendations.
Follow Us