Telugu Astrology: గురువుకు అస్తంగత్వ దోషం.. ఈ రాశుల వారికి ఆర్థిక నష్టాలు జాగ్రత్త..!

జూలై 14 నుంచి ఆగస్టు 12 వరకు గురువు అస్తంగత్వ దోషం కారణంగా కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు జాగ్రత్తలు పాటించాలి. దత్తాత్రేయ స్వామి, గణపతిని ఆరాధించడం, గురువుకు ప్రదక్షిణలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.

Telugu Astrology: గురువుకు అస్తంగత్వ దోషం.. ఈ రాశుల వారికి ఆర్థిక నష్టాలు జాగ్రత్త..!
Guru Asthangatwa Dosha

Edited By:

Updated on: Jul 13, 2026 | 3:46 PM

జూలై 14 నుంచి ఆగస్టు 12 వరకు గురువుకు అస్తంగత్వ దోషం ఏర్పడుతోంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న గురువుతో రవి యుతి చెందడం వల్ల గురువు అస్తంగత్వం, అంటే దగ్ధం చెందడం జరుగుతుంది. ఈ దోషం వల్ల కొన్ని రాశుల వారు కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కలుగుతుంది.. మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి పూర్తిగా శుభ ఫలితాలు కాకుండా మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశుల వారు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడంతో పాటు, దత్తాత్రేయ స్వామి, గణపతిని ఎక్కువగా స్మరించడంతో పాటు గురువుకు ప్రదక్షిణలు చేయడం మంచిది.

  1. మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురువు ఉచ్ఛస్థితిలో ఉండడం వల్ల ఈ రాశివారు హంస మహా పురుష యోగ ఫలితాలను అనుభవిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. అయితే, అస్తంగత్య దోషం వల్ల కుటుంబంలో శుభ కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి.. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. సుఖ సంతోషాలు తగ్గుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న గురువు వల్ల ఈ రాశివారు అన్ని విషయాల్లోనూ ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఈ రాశికి ఏర్పడిన హంస మహా పురుష యోగం వల్ల రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. గురువుకు అస్తంగత్య దోషం కలగడం వల్ల అనారోగ్యాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. బంధు మిత్రుల వల్ల ధన నష్టం కలుగుతుంది. విలువైన వస్తువులు కోల్పోయే సూచనలున్నాయి.
  3. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు వల్ల అనేక విధాలైన లాభాలు కలుగు తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.. అయితే, ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోవడం, మోసపోవడం ఎక్కువగా జరుగుతుంది.. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం పెట్టుకోవద్దు. ఆర్థిక విషయాల్ని ఇతరులకు అప్పగించకపోవడం చాలా మంచిది.
  4. వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న గురువు వల్ల ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా జరు గుతాయి. ముఖ్యంగా పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అయితే, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలతో సహా ముఖ్యమైన ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న గురువు వల్ల ఈ రాశివారికి హంస మహా పురుష యోగం కలిగింది. ఆదాయం వృద్ధి చెందడంతో పాటు, రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.. గురువుకు అస్తంగత్వ దోషం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
  7. మీనం: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛస్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం పూర్తిగా తగ్గి, అనేక శుభయోగాలు అనుభవానికి వస్తాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజయోగాలు, ధన యోగాలతో జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. అస్తంగత్వ దోషం వల్ల పిల్లలతో సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని సమస్యలు తలెత్తుతాయి.

Also Read: చంద్రుడి అనుగ్రహంతో వారికి జాక్ పాట్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఉన్న సూచనలు మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. వ్యక్తిగత విశ్వాసాన్ని బట్టి వీటిని అనుసరించవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us