AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోండి.. ఇక మీకు తిరుగే ఉండదు..!

ప్రస్తుత గ్రహ సంచారం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారు తమకు అనుకూలంగా ఉన్న గ్రహాన్ని లేదా ఆ గ్రహాధిదేవతను ఆరాధిస్తే ఆదాయం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం వంటి రంగాల్లో శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Astrology: ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోండి.. ఇక మీకు తిరుగే ఉండదు..!
Telugu Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2026 | 5:21 PM

Share

ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి కొన్ని రాశులకు కొన్ని గ్రహాలు అన్ని విధాలుగానూ చేయూతనందించే అవకాశం ఉంది. ఆ గ్రహాన్ని గానీ, ఆ గ్రహానికి సంబంధించిన అధిదేవతను గానీ తరచూ ప్రార్థించడం వల్ల, పరిహారం చేయడం వల్ల అతి వేగంగా కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరడం జరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారు తమకు చేయూతనందించే గ్రహాన్ని సంతృప్తిపరచడం వల్ల ఆదాయం పెరగడం, ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడం, ఆరోగ్యం మెరుగుపడడం వంటివి జరుగుతాయి.

  1. మేషం: ఈ రాశికి ప్రస్తుతం లాభ స్థానంలో ఉన్న రాహువు అన్ని గ్రహాల కంటే బాగా అనుకూలంగా ఉంది. ఈ గ్రహాన్ని అనుకూలంగా మార్చుకోవడం వల్ల ఈ రాశివారికి ఆదాయం పెరగడం, పదోన్నతులు కలగడం, ఉద్యోగం లభించడం, పెళ్లి కావడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయి. రాహువుకు పూజ చేయించడం, సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల రాహువు వీరిని ఉచ్ఛస్థితికి తీసుకువెడుతుంది. మంచి విదేశీ అవకాశాలు కూడా కల్పిస్తుంది.
  2. వృషభం: ఈ రాశికి ఇతర గ్రహాలన్నిటి కంటే లాభ స్థానంలో ఉన్న శనీశ్వరుడు బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల శనిని మరింతగా అనుకూలంగా మార్చుకోవలసిన అవసరం ఉంది. ఆదాయ వృద్ధితో పాటు, ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నవారికి శని అనుగ్రహం తప్పనిసరి. తరచూ శనికి ప్రదక్షిణలు చేయడం, శివార్చన చేయడం చాలా మంచిది.
  3. కర్కాటం: ప్రస్తుతం ఈ రాశికి అనుకూలంగా ఉన్న గ్రహం గురువు. అయినందువల్ల ఈ గ్రహాన్ని తరచూ ఏదో ఒక రూపంలో ఆరాధించడం చాలా మంచిది. దత్తాత్రేయ స్వామిని, దత్తాత్రేయ అవతారాలను, గురువులను పూజించడం వల్ల ఈ రాశివారికి గురు గ్రహం ద్వారా జరగాల్సిన మేలంతా జరిగే అవకాశం ఉంది. ఆదాయం పెరగడం, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం వంటివన్నీ సాకారమవుతాయి.
  4. తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడే ఈ రాశికి చేయూతనందించే గ్రహం. అందువల్ల శుక్రుడిని సంతృప్తిపరచడం మీద దృష్టి పెట్టడం మంచిది. సుఖసంతోషాలను, సిరిసంపదలను, భోగభాగ్యా లను అనుగ్రహించే శుక్రుడు అనుకూలంగా మారి మనసులోని కోరికలు, ఆశలు, ఆశయాలను నెరవేర్చాలన్న పక్షంలో ఈ రాశివారు తరచూ దుర్గాదేవిని ఆరాధించడం మంచిది. లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణ వల్ల లబ్ధి కలుగుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. వృశ్చికం: ఈ రాశికి రాశ్యధిపతి కుజుడి వల్లే ఏ లాభమైనా కలుగుతుంది. అందువల్ల కుజుడిని తరచూ ప్రార్థించడం మంచిది. కుజుడికి తరచూ ప్రదక్షిణలు చేయడం, స్కంధ స్తోత్రం పఠించడం, మంగళ వారాలు ఉపవాసాలు ఉండడం వంటి పరిహారాల వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, విదేశాల్లో ఉద్యోగాలు లభించడం, వైవాహిక జీవితంలో సమస్యలు తొలగడం, సంతానం కలగడం వంటివి జరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై ఆస్తి లభించే అవకాశం ఉంది.
  7. మకరం: రాశ్యధిపతి శని ప్రస్తుతం తృతీయస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి శని అత్యంత ప్రధానమైన గ్రహంగా మారింది. శని అనుగ్రహించే పక్షంలో సామాన్యుడు కూడా అందలాలు ఎక్కే అవకాశం ఉంటుంది. శనికి తరచూ ప్రదక్షిణలు చేయడం, దీపం వెలిగించడం, శివార్చన చేయడం వంటి చర్యల వల్ల వీరి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆదాయం పెరగడం, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి.

Follow Us