మీ జాతకంలో కాల సర్ప దోషం ఉందా? ఈ 5 ఆలయాలు దర్శించుకుంటే చాలు!

తమ జాతకంలో కాల సర్ప దోషం ఉన్నవారు మానసిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వాటిని నివారించేందుకు పండితులు పలు పరిహారాలను, ఆలయాల సందర్శనలు సూచిస్తు్న్నారు. వాటిలో ముఖ్యంగా ఐదు దేవాలయాలను దర్శించుకుంటే మంచిది. కుక్కు సుబ్రహ్మణ్యస్వామి, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలలో ప్రత్యేక చేయడం, నవగ్రహ పూజలు చేయడం ద్వారా దోష ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని జ్యోతిష్కులు చెబుతున్నారు.

మీ జాతకంలో కాల సర్ప దోషం ఉందా? ఈ 5 ఆలయాలు దర్శించుకుంటే చాలు!
Kala Sarpa Dosham

Updated on: Dec 31, 2025 | 12:56 PM

మీ జాతకంలో కాల సర్ప దోషం ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాల సర్ప దోష నివారణకు అనేక పరిహారాలను సూచిస్తుంటారు జ్యోతిష్యపండుతులు. అంతేగాక, కాల సర్ప దోషాల నివారణకు పలు అద్భుత ఆలయాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయాలను దర్శించుకుని పూజలు చేస్తే సర్ప దోషాలు నివారించబడతాయి. వాటిలో ముఖ్యంగా ఐదు దేవాలయాలు ఉన్నాయి. కుక్కే సుబ్రహ్మణ్యస్వామి, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలలో ప్రత్యేక పూజలు చేయడం, నవగ్రహ పూజలు చేయడం ద్వారా దోష ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఆ
ఆలయాల గురించి తెలుసుకుందాం.

సర్పదోషం వలన వ్యక్తిగత, కుటుంబ జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. వివాహం ఆలస్యం కావడం, వైవాహిక జీవితంలో ఆటంకాలు, భార్యాభర్తల మద్య అనవసరమైన అపోహలు, కలహాలు తరచూ జరుగుతుంటాయి. కొందరిలో సంతాన సమస్యలు ఉంటాయి. మరికొందరు మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. ఏదో ఒక విధమైన వైరాగ్యం, అశాంతి, మోసపోవడం, కుటంబంలో కలతలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారు. శివుడు, సుబ్రహ్మణ్యస్వామి, నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా కాల సర్ప దోషాలను నివారించుకోవచ్చు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం మహా శివునికి అంకితం చేయబడింది. సర్ప దోషం కీలకమైన రాహు, కేతువుల సంబంధానికి ప్రసిద్ధి చెందింది. కాల సర్ప దోషం ప్రభావాలను తగ్గించడానికి ఈ ఆలయంలో రాహు-కేతు సర్ప దోష నివారణ పూజలు నిర్వహిస్తారు.

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం:

కర్ణాటక రాష్ట్రంలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా కాల సర్ప దోషాల నివారణకు ప్రసిద్ధి. ఈ ఆలయంలో కార్తికేయ అవతారమైన సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది. సుబ్రహ్మణ్య స్వామి సర్పాలతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నారు. సర్ప సంస్కార ఆచారంతో సహా కాల సర్ప దోష నివారణలకు ఇది ప్రసిద్ధ గమ్యస్థానమనే చెప్పాలి. సర్ప దోష దుష్ప్రభావాల నుంచి రక్షణ పొందడానికి భక్తులు ప్రత్యేక పూజలు, నివారణ ఆచారాలు నిర్వహిస్తారు.

మహా కాళేశ్వర ఆలయం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిన మహా కాళేశ్వర ఆలయం జ్యోతిర్లింగాలలో ఒకటి. కాల సర్ప దోషాలను తగ్గించేందుకు ఈ ఆలయం ఒక శక్తివంతమైన ప్రదేశంగా పరిగణిస్తారు. కాల సర్ప దోషాలను నివారించుకునేందుకు దేశ వ్యాప్తంగా ఇక్కడి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి.

ఓంకారేశ్వర్ ఆలయం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నర్మదా నదీ తీరాన ఉన్న మరో గొప్ప పుణ్యక్షేత్రం ఓంకారేశ్వర్ ఆలయం. ఇక్కడ ప్రధాన దైవం మహా శివుడు. కాల సర్ప దోషాల నివారణ పూజలు నిర్వహించేందుకు ఈ ఆలయం కూడా ప్రసిద్ధి. ఇక్కడికి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చి సర్ప దోష నివారణ పూజలు నిర్వహిస్తారు.

త్రయంబకేశ్వర్ ఆలయం

మహారాష్ట్రంలోని నాసిక్‌లో ఉన్న ప్రముఖ శివక్షేత్రం త్రయంబకేశ్వర్ ఆలయం కూడా కాల సర్ప దోష నివారణలకు పేరుగాంచింది. సర్ప దోష పూజలను వేద పండితుల సహాయంతో ఇక్కడ నిర్వహిస్తారు. కాల సర్ప దోషం ఉన్నవారు ఈ ఐదు ఆలయాలను దర్శించుకుని నివారణ పూజలు, ఆచారాలు నిర్వహించడం ద్వారా నివారించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. నాగ దోష ప్రభావాన్ని, జాతకాన్ని పరిశీలించి పండితులు సూచిన తగిన పరిహారాలు చేయడం ద్వారా జీవితంలో సానుకూల వాతావరణం నెలకునేలా చేసుకోవచ్చని చెబుతున్నారు.