Horoscope Today(September 21st2-21): ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో (సెప్టెంబర్ 21) ఈరోజు మంగళవారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!
మేష రాశి: ఈ రాశివారికి అకష్మిక ధన లాభం ఉంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అంతటా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. బంధు మిత్రులను కలుస్తారు.
వృషభ రాశి:ఈ రాశివారికి శుభఫలితాలను ఇస్తుంది. చేపట్టిన పనులు జరుగుతాయి, కొత్త వస్తవులను, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అప్పు తీరుస్తారు
మిధున రాశి:ఈరాశివారికి ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటకంకాలు ఏర్పడతాయి. ఆర్ధిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ధన నష్టం కలిగే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కర్కాటక రాశి:ఈ రాశివారికి సంఘంలో కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. కొత్తపనులకు అనుకూల సమయం కాదు.. బంధుమిత్రులతో కలహం ఏర్పడే అవకాశం ఉంది, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
సింహ రాశి:ఈరోజు చేపట్టినటువంటి పనులు జరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం ఉంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి.
కన్య రాశి:ఈ రాశివారు ఈరోజు బంధుమిత్రులను కలుస్తారు. రాజకీయ, క్రీడాకారులకు మంచి అవకాశాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంది.
తులా రాశి: ఈ రాశివారికి అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి జరుగుతుంది.
వృశ్చిక రాశి:ఈరోజు నిర్ణయాలు తీసుకునే సమయంలో ఏ మాత్రం కూడా తొందరపడకూడదు. మంచిచెడులు గురించి ఆలోచనచేయడం మంచిది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కలహాలకు దూరంగా ఉంటె మేలు.
ధనుస్సు రాశి:ఈరోజు ఈ రాశి విద్యార్థులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.
మకర రాశి:ఈ రాశి వారికి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. నూతన వ్యక్తులు పరిచయం ఏర్పడుతుంది. పిల్లల వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
కుంభ రాశి:ఈరాశి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అప్పులు తీరుస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. శత్రు బాధలు తీరతాయి.
మీన రాశి:ఈ రాశివారు ఈరోజు చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కీర్తి ప్రతిష్టలు పొందుతారు.
Also Read : Panchamukha Hanuman: మంగళవారం రోజున పంచముఖ ఆంజనేయస్వామి ఏ విధంగా పూజిస్తే శుభఫలితాలు పొందుతారంటే..