Horoscope Today: వారికి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి.. 12రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 18, 2025): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృషభ రాశి వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మిథున రాశికి చెందిన ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారికి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి.. 12రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 18 September 2025

Edited By:

Updated on: Sep 18, 2025 | 5:31 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 18, 2025): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృషభ రాశి వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మిథున రాశికి చెందిన ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. తలపెట్టిన ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పని తీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు బాగా లాభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా కొన్ని అరుదైన ఆఫర్లు అందుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మాట ఇవ్వకపోవడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూల ఫలితాలనిస్తుంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. తలపెట్టిన ప్రతి పనీ నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల సహకారంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. వృత్తి జీవితం బిజీ అవుతుంది. వ్యాపార పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం బాగా ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగి పోతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆదాయం వృద్ది చెందుతుంది కానీ, వృథా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా విశ్రాంతి లోపిస్తుంది. గతంలో మీ నుంచి ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిదానంగా పూర్తవుతాయి. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలు పొందుతారు. పెండింగ్ పనులు, వ్యవహారాలన్నీ తేలికగా పూర్తవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. కొద్ది శ్రమతో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువ రాబడి ఉంటుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు బాగా అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికారుల సహాయ సహకారాలుంటాయి. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగులకు సాఫీగా సాగిపోతుంది. ముఖ్య మైన వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రయాణాలు ఇబ్బంది కలి గిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మొండి బాకీలు వసూలు అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగి పోతాయి. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఇబ్బంది పెడుతుంది. బంధువులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వకపోవడం మంచిది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదర వర్గంతో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.