Horoscope Today: ఏ ప్రయత్నం చేసినా వారికి విజయం పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (March 22, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. కొందరు ఇష్టమైన బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహం పెరుగుతుంది. కీలక బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: ఏ ప్రయత్నం చేసినా వారికి విజయం పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 22 March 2026

Edited By:

Updated on: Mar 22, 2026 | 5:31 AM

దిన ఫలాలు (మార్చి 22, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపించే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహం పెరిగి..కీలక బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు మరింత ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. కొందరు ఇష్టమైన బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కూడా లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. బంధు మిత్రులతో వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల అంచనాలకు మించి ప్రయోజనాలు పొందుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహం పెరుగుతుంది. కీలక బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో కూడా లాభాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. బంధుమిత్రుల్లో కొందరికి ధన సహాయం చేయాల్సి వస్తుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకుంటాయి. ఆరోగ్యం పరవాలేదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలమయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు బిజీగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఇంటికి బంధుమిత్రుల రాకలుంటాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా సాగుతుంది. జీవిత భాగస్వామి తన ఉద్యోగంలో పురోగతి చెందుతారు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆదాయానికి తగ్గట్టుగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగుతుంది. కొత్త ఆలోచనలు, ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ సకాలంలో బాధ్యతల్ని పూర్తి చేస్తారు. వృత్తి జీవితంలో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. సోదరుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటికి బాగా దగ్గర బంధువుల రాకపోకలుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనవసర కోపతాపాలతో కుటుంబంలో ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి గౌరవాభిమానాలు లభిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికపరంగా ఒత్తిడి బాగా తగ్గుతుంది. నిరుద్యోగులు ఆఫర్లు అందుకుంటారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను ఒక ప్రణాళిక ప్రకారం చక్కబెడతారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తాయి. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో అంచనాలకు మించి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలనిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెడతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడ తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులు నిదా నంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ వ్యవహా రాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటు లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. కొందరు ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి తప్పకపోవచ్చు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

Follow Us