
దిన ఫలాలు (జూన్ 26, 2026): మేష రాశి వారు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. సహోద్యోగులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. మిథున రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ రాబడి ఎక్కువగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలతో అధికారులు లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. ఆస్తి, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధువులతో ఒకటి రెండు ఇబ్బందులు ఉండవచ్చు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొద్దిగా శ్రమ, తిప్పట ఉంటాయి. ఆరోగ్యానికి లోటుండదు.
వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. సహోద్యోగులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం వచ్చే అవకాశముంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం కావచ్చు. ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల కనిపిస్తోంది.
ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ రాబడి ఎక్కువగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఉద్యోగం మారడానికి కూడా అవకాశముంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి.
ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా, సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తీరిపోయి, కొద్దిగా మనశ్శాంతి కలుగుతుంది. వ్యయ ప్రయాసలతో గానీ ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాదు. ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్య ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.
ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్త పడడం అవసరం. అదనపు ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడం మీద దృష్టి పెడతారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తులవారికి రాబడి పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృథా ఖర్చులు, ఉచిత సహాయాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకుంటారు. ఇతరుల బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. రావలసిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆశించిన శుభవార్త వింటారు.
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. అధికారులను పని తీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి విజయాలు పొందుతారు. రాబడిలో ఏమాత్రం తగ్గుదల ఉండదు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ధన సంపాదన నిలకడగా సాగిపోతుంది. సంపాదన పెంచుకోవడానికి మార్గాలు లభ్యమవుతాయి. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు పెండింగులో పడతాయి. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగిపోతుంటాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
ఉద్యోగంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒక్క క్షణం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. సమయం బాగా అనుకూలంగా ఉంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆదాయ వృద్ధి రూపంలో అదృష్టం పడుతుంది. ఉద్యోగంలో ఆశించిన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కీలక విషయాల్లో జీవిత భాగస్వామి సహాయంగా ఉంటారు.
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ప్రతిఫలం లభించవచ్చు. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఉచిత సహాయాలు చేయకపోవడం మంచిది. ఒకటి రెండు చిన్నాచితకా సమస్యల నుంచి బయటపడతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. అనేక మార్గాల్లో ధన సంపాదన ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. నిరుద్యోగులు సాధారణ ఉద్యోగాలతో సర్దుకుపోవాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తలు అందే అవకాశముంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. బంధువుల రాకపోకలుంటాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు విస్తరిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు మిత్రుల వల్ల సమస్యల్లో చిక్కుకునే అవకాశముంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది.