Horoscope Today: అబ్బ.! వీరి ఇంట డబ్బులే డబ్బులు.. దశ తిరిగినట్టే.. శుక్రవారం రాశిఫలాలు ఇలా

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. కొత్త ఉద్యోగావకాశాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ తేలికగా నమ్మకపోవడం మంచిది.

Horoscope Today: అబ్బ.! వీరి ఇంట డబ్బులే డబ్బులు.. దశ తిరిగినట్టే.. శుక్రవారం రాశిఫలాలు ఇలా
Horoscope Today

Edited By:

Updated on: Jan 16, 2026 | 6:44 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగు తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల విందులు, వినోదాల మీద ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగంలో శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త మార్పులు చేపట్టి లాభాలు ఆర్జిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబంతో ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. మిత్రులకు బాగా సహాయం చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉండ వచ్చు. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి సమస్యేమీ ఉండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. బరువు బాధ్యతలతో ఇబ్బంది పడతారు. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు, అవివాహితులకు సమయం బాగా అను కూలంగా ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. దూర ప్రాంతం నుంచి అనుకోకుండా ఒక శుభవార్త అందుతుంది. కుటుంబ ‍సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు సజావుగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారుల నమ్మకాన్ని చూరగొం టారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. కుటుంబంలో కొద్దిగా చికాకులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఇష్టమైన ఆలయాలను సందర్శి స్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు చేపడతారు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది కానీ, సహోద్యోగులతో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల్ని సమయస్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అధికారులు, సహోద్యోగులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తు లవారు బాగా బిజీ అయిపోతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయం, ఆరోగ్యాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. మధ్యవర్తుల కారణంగా ఆస్తి వివాదం పరి ష్కారం అవుతుంది. తోబుట్టువులతో వివాదాలు తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కొందరు సన్నిహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సామాజిక సహాయ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. కుటుంబపరంగా సంపాదన బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. తల్లితండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాలు పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాలు నిలకడగా పురోగ మిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. సొంత పనులు పూర్తి చేసు కోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయ త్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. రావ లసిన సొమ్ము చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు గడిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు కొత్త ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరి ష్కారం అవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులు, సహోద్యోగులు ఎక్కువగా మీ మీద ఆధారపడడం జరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలి తాలనిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. కొత్త ఉద్యోగావకాశాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ తేలికగా నమ్మకపోవడం మంచిది. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం ఉత్తమం. జీవిత భాగ స్వామి సలహాలు, సూచనలకు విలువనివ్వడం మంచిది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపా రాల్లో లాభాలు గడిస్తారు. ఆస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. ఇల్లు గానీ, స్థలంగానీ కొనే విషయం ఆలోచిస్తారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెడతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలి స్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలుంటాయి.