
దిన ఫలాలు (ఫిబ్రవరి 28, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి కీలక ఆర్థిక సమస్యలు తీరిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగంలో స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు సాయం చేయడం కూడా జరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన పనుల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి.
ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడడం కంటే సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
ఉద్యోగంలో శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కీలక ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. వ్యక్తిగతంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరవమర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు.
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఏ విషయంలోనూ తొంద రపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో సంప్రదించడం వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.
ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ జీవి తం సామరస్యంగా, సానుకూలంగా సాగిపోతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు చిన్న సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరిగే అవకాశముంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో విలాస జీవితం అనుభవిస్తారు. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించవచ్చు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృత్తి, ఉద్యోగాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉండే అవకాశముంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశముంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వీలైనంతగా వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు, ఆహార, విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. దాంపత్యంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా అవకాశాలు అంది వస్తాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. సన్నిహితులకు సహాయం చేయాల్సి వస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలకు విలువనివ్వడం మంచిది. పెండింగ్ పనులను నిదానంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుంచి ఆదరణ పెరుగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తాయి. జీవిత భాగస్వామికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కీలక బాధ్యతలు మారే అవకాశముంది. అయితే, పని ఒత్తిడి పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించినంత తొందరగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. పిల్లలకు చదువుల్లో సమయం అనుకూలంగా ఉంది. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తులవారికి డిమాండ్ బాగా పెరుగుతుంది.
ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి జీవితం చాలావరకు బిజీగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులకు అండగా నిలబడ తారు. ఇష్టమైన బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.