Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (December 31, 2025): మేష రాశి వారికి ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. కొత్త వాహన కొనుగోలు ప్రయత్నాలు చేపడతారు. వృషభ రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు. మిథున రాశి వారు ṣఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆశించిన పురోగతి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashi Phalalu 31 December 2025

Edited By:

Updated on: Dec 31, 2025 | 5:31 AM

దినఫలాలు (డిసెంబర్ 31, 2025): మేష రాశి వారికి ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం కొనసాగే అవకాశముంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. మిథున రాశి వారు ṣఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి రావొచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా బాగా అనుకూలంగా సాగిపోతాయి. సోదరులతో రాజీమార్గం ద్వారా ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. కొత్త వాహన కొనుగోలు ప్రయత్నాలు చేపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నా ఫలితముంటుంది. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో వివాదాలు సర్దుమణుగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ, నిదానంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా చక్కబెడతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ప్రతిఫలం ఎక్కువగానే ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. రాజపూజ్యాలు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు, పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఉండే అవకాశముంది. కొత్త ఉద్యోగం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పనిభారం బాగా ఎక్కువగా ఉంటుంది. అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిరాటంకంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల చదువుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా లాభాలకు లోటుండదు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆర్థికాభివృద్ధికి బాగా అవకాశముంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా కొనసాగు తాయి. స్థిరాస్తిక్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో అత్యవసర బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో నష్టాలు కొద్దిగా తగ్గు ముఖం పడతాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది. ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలున్నా సరైన విధంగా వాటిని పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల విస్తరణకు అవకాశాలున్నాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో పైచేయి సాధిస్తారు. కొత్త ఉద్యోగం విషయంలో శుభవార్తలు అందుతాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొత్త కార్యక్రమాలు, కొత్త పనులు ప్రారంభిస్తారు. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెట్టే అవకాశముంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గాఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాల నుంచి ఊరట లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు మిత్రులతో వివాదాలు పరి ష్కారమవుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు కాలం అనుకూలంగా ఉంది. సొంత ఇంటి ప్రయత్నాలపై దృష్టి పెడతారు. పిల్లలు పురోగతి సాధిస్తారు.