
దిన ఫలాలు (డిసెంబర్ 19, 2025): మేష రాశి వారికి ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశ వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆదాయం కొద్దిగా వృద్ది చెందుతుంది. అనుకున్న సమయానికి ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. జీవిత భాగస్వామికి ఉద్యోగ పరంగా పురోగతి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆలోచించి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం నుంచి ఉపశ మనం లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గే అవకాశముంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందే సూచనలున్నాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోకపోవడం మంచిది. విదేశాల్లోని పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. అధికారుల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. అత్యవసర పనుల్ని జాగ్రత్తగా పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పిల్లలు చదువులు, పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఎవరికీ హామీలు ఉండవద్దు. మిత్రుల వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో అధికారుల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రణాళిక ప్రకారం వ్యవహరించి వ్యక్తిగత, ఆర్థిక సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. కుటుంబంతో శుభ కార్యంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సహాయంతో కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆదాయ వృద్ధి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఎవరికీ హామీలు ఉండవద్దు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆహార, విహారాల్లో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితముంటుంది. జీతభత్యాల్లో కొద్దిపాటి మార్పులు జరిగే అవకాశముంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం ఉత్తమం. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరిగినప్పటికీ, లాభాలు నిలకడగా కొనసాగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా పని భారం వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. కొందరు మిత్రులతో సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు ప్రవేశపెడతారు. ముఖ్య మైన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయ డం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. జీతభత్యాలకు సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి. ఆదాయం కొద్దిగా వృద్ది చెందే అవకాశం ఉంది కానీ, వృథా ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల్లో కొందరికి మీ సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో సానుకూల పరిస్థితులుంటాయి. వ్యాపార వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి. వృత్తి జీవితం బాగా బిజీగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల మీద అతిగా ఖర్చుపెట్టే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఒక శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా కొన్ని చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మిత్రులతో సరదాగా గడుపుతారు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది.