Horoscope Today: ఆహా.! ఏం రాజయోగం.. వీరికి లక్కే లక్కు.. డబ్బే డబ్బు.. మంగళవారం రాశిఫలాలు ఇలా..

వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యయ ప్రయాసలున్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగు పనులను సంతృప్తి కరంగా పూర్తి చేస్తారు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. కుటుంబ బాధ్యతల విషయంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది.

Horoscope Today: ఆహా.! ఏం రాజయోగం.. వీరికి లక్కే లక్కు.. డబ్బే డబ్బు.. మంగళవారం రాశిఫలాలు ఇలా..
Daily Horoscope

Edited By:

Updated on: Apr 28, 2026 | 6:27 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా పురోగమిస్తుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్ప కపోవచ్చు. మిత్రుల ఆర్థికంగా కొద్దిగా నష్టపోయే సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్య అవకాశా లున్నాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారంలో కొద్దిపాటి శ్రమతో అత్యధిక లాభాలు గడిస్తారు. వృత్తి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దాంపత్య జీవితం చాలావరకు సానుకూలంగా, సంతోషంగా గడిచిపోతుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు ఆర్థికంగా సహాయపడతారు. ముఖ్య మైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. సహోద్యోగులకు సహకారం అందిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి దొర కని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ. తిప్పట ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సమే తంగా ఆలయాల సందర్శన చేసుకుంటారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి.  సామాజికంగా మీ మాటకు విలువ ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. రుణ భారం తగ్గిం చుకునే ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పురోగతి చెందడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మిత్రులకు ఆర్థికంగా సాయం చేస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆస్తి వివాదం కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తవుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు పురోగతి చెందు తాయి. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త ఉద్యోగాలు, ఆదాయ మార్గాల గురించి చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు బాగా బిజీ అయిపో తాయి. రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులను సునాయా సంగా పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. అద నపు ఆదాయ మార్గాలు సఫలమవుతాయి. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో బాగా ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. ఏ పని తలపెట్టినా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. కొందరు మిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. ఆదాయానికి లోటుండదు కానీ, కొన్ని వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ, దైవ కార్యాల్లోనూ పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్తగా కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఎవరికీ అతిగా నమ్మవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. ఇతరులకు చేసిన వాగ్దానాల కారణంగా ఇరకాటంలో పడతారు. లేనిపోని బాధ్యతలను నెత్తికెత్తుకోవడం జరు గుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆదాయానికి సంబంధించి కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరు గుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఆశించిన సత్ఫలితాలనిస్తాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడా నికి, వ్యాపారాలు విస్తరించడానికి ఆలోచనలు సాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొం టారు. స్వల్పంగా అనారోగ్య సమస్యలుంటాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తవింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యయ ప్రయాసలున్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగు పనులను సంతృప్తి కరంగా పూర్తి చేస్తారు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. కుటుంబ బాధ్యతల విషయంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు నుంచి ఊహించని సమస్యలు తలెత్తుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఏ పని తలపెట్టినా సునాయాసంగా పూర్తవుతుంది. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

Follow Us