Horoscope Today: వీరికి ధనలాభం ఉంటుంది.. ప్రయాణాలు అధికంగా చేస్తారు.. సోమవారం రాశి ఫలాలు..

|

Feb 28, 2022 | 7:12 AM

ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించేవారు ఉన్నారు. రోజులో తాము ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాము.. ఏవైనా పనులు మొదలుపెట్టాలన్నా

Horoscope Today: వీరికి ధనలాభం ఉంటుంది.. ప్రయాణాలు అధికంగా చేస్తారు.. సోమవారం రాశి ఫలాలు..
Follow us on

ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించేవారు ఉన్నారు. రోజులో తాము ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాము.. ఏవైనా పనులు మొదలుపెట్టాలన్నా.. ఎక్కడైనా వెళ్లాలంటే.. ముందుగా తమ రాశి ఫలం చూసుకుంటారు. ఈరోజు.. సోమవారం…చతుర్ధశి నక్షత్రం. అమృత ఘడియలు.. రాత్రి 7.07 నుంచి 8.34 వరకు ఉన్నాయి. అలాగే.. దుర్ముహూర్తం పగలు 12.24 నుంచి 1.21 వరకు ఉంటుంది. మరీ ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేష రాశి..
ఈరోజు వీరు చేపట్టే పనులలో అడ్డంకులు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు తలెత్తుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రతి విషయంలో జాగ్రత్తలు అవసరం.

వృషభ రాశి..
ఈరోజు వీరు దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు ఎక్కువవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. వ్యాపారం, ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

మిథున రాశి..
వీరు కొత్త పనులను ప్రారంభిస్తారు. బంధుమిత్రులు.. కుటుంబసభ్యుల మద్దతు పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది.

కర్కాటక రాశి..
వీరు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించకుండ ఉండడం మంచింది. ఆత్యీయుల నుంచి ఎలాంటి సహాకారం రావు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

సింహ రాశి..
వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కొత్త వారిని కలుసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.

కన్య రాశి..
ఈరోజు వీరు దైవ దర్శనానికి వెళ్తుంటారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులకు అడ్డంకులు ఏర్పడతాయి.

తుల రాశి..
ఈరోజు వీరు బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషాలు ఉంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి.

వృశ్చిక రాశి..
ఈరోజు వీరు కొత్త పనులను చేపడతారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వృథా ప్రయాణాలు చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు.

ధనుస్సు రాశి..
ఈరోజు వీరు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాధలు పెరుగుతాయి. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.

మకర రాశి..
ఈరోజు వీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

కుంభ రాశి..
ఈరోజు వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. విందులు, వినోదాల్లో పాల్గోంటారు.

మీన రాశి..
ఈరోజు వీరు శుభకార్యాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్తవారితో స్నేహం చేస్తారు.

Note: రాశిఫలాలు అనేవి నమ్మకానికి సంబంధించినవి.. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు రాశిఫలాలు ఇవ్వడం జరిగింది.

Also Read: Viral Photo: చూడగానే మైమరిపించే కళ్లు.. చూస్తూనే ఉండాలనిపించే మోము.. ఎవరో గుర్తించారా..?

Aadavallu Meeku Johaarlu Trailer: ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ రిలీజ్.. ఫుల్ కామెడీతో వస్తోన్న శర్వానంద్..

Surekha Konidela: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ సతీమణి.. సూపర్ స్టైలీష్ కొడుకు అంటూ..

Indian Idol Telugu Episode 2: ఆ వాయిస్‏కు థమన్ ఫిదా.. మణిశర్మకు పరిచయం చేస్తానంటూ హామీ..