Horoscope Today: ఆ రాశి వారు వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Oct 26, 2023 | 5:01 AM

దిన ఫలాలు (అక్టోబర్ 26, 2023): మేష రాశి వారికి గురువారంనాడు వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఆదరణ, గౌరవాభిమానాలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాడు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారు వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 26th October 2023
Follow us on

దిన ఫలాలు (అక్టోబర్ 26, 2023): మేష రాశి వారికి గురువారంనాడు వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఆదరణ, గౌరవాభిమానాలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాడు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో మరీ ఎక్కువగా నష్టాలు ఉండకపోవచ్చు. భూ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఇతర విషయాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబ జీవితం సామ రస్యంగా సాగిపోతుంది. ప్రయాణాలు పెట్టుకోవద్దు. భరణి నక్షత్రం వారికి సమయం అనుకూలంగా ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవ సర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులుంటారు. వ్యాపారాల్లో పోటీదార్లు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మాటకు విలువ ఉంటుంది. బంధు మిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. కృత్తికా నక్షత్రం వారు మరింత ఎక్కువగా లాభపదే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఆదరణ, గౌరవాభిమానాలు పెరుగుతాయి. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఆధ్యా త్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కు వగా సఫలం అవుతాయి. ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవు తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుకుంటారు. పునర్వసు నక్షత్రం వారికి కలిసి వస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేసి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మంచి కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకుంటాయి. పుష్యమి నక్షత్రం వారు ఆర్థికంగా అత్యధిక ప్రయోజనం పొందడం జరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవు తాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా అనుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపా రాల్లో అనుకోకుండా లాభాలు పెరుగుతాయి. కుటుంబానికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద మరిం తగా శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు పెట్టుకోవద్దు. పుబ్బా నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగు తుంది. వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడు తుంది. కుటుంబ జీవితం సజావుగా సాగిపోతుంది. సతీమణితో అన్యోన్యత పెరుగు తుంది. విదే శాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పునర్వసు నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి ఉంటాయి. ఉద్యోగ జీవితంలో మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. అనవసర ఖర్చులు వీలైనంగా తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. విశాఖ నక్షత్రం వారికి ఆశించిన శుభవార్త అందు తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. వ్యక్తిగత పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా వివాహ సంబంధం కుదిరే సూచనలున్నాయి. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. సతీ మణితో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. అనూరాధ నక్షత్రం వారు శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కొత్తగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరగడంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు అంచనాలకు మించి అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగు పడుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పుష్యమి నక్షత్రం వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారాలను పంచుకుంటారు. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. తల్లి తండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలి గిస్తుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అధికారులతో మవీలైనంత సామరస్యంగా వ్యవహరించడం మంచిది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. విదేశాల నుంచి ఆశిం చిన సమాచారం అందుతుంది. శతభిషం నక్షత్రంవారు మరింతగా శుభ ఫలితాలు పొందుతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో అధికారం చేపడతారు. వృత్తి జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపా రులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. రేవతి నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది.