దిన ఫలాలు (ఫిబ్రవరి 26, 2024): మేష రాశి వారికి ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మిథున రాశి వారు ఇతరులకు ఆర్థిక సహాయం చేయడానికి ఇది సమయం కాదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి. నిరుద్యోగులకు అనుకోకుండా కొత్త అవకాశాలు అందివస్తాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. అనవసర స్నేహాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు కూడా బాగా తగ్గించుకునే అవకాశం ఉంది. బాకీలు, బకా యిలు వసూలు అవుతాయి. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. అయితే, కొందరు స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగవద్దు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అయితే, ప్రస్తుతానికి ఎవరికీ డబ్బు ఇవ్వడం గానీ, ఎవరి నుంచైనా డబ్బు తీసుకోవడం గానీ చేయవద్దు. ఇతరులకు ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఇది సమయం కాదు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపా రాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవా లేదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో చిన్నా చితకా సమస్యలున్నా వాటిని అధిగమిస్తారు. వృత్తి జీవితంలో తీరిక లేని పరి స్థితి ఏర్పడుతుంది. లాభాలపరంగా వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది, పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపో వచ్చు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చాలావరకు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. జీవిత భాగ స్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. అత్యవసర పనుల్ని చక్కబెడతారు. ముఖ్య వ్యవహారాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహాయ సహాకారాలు ఉంటాయి. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థి కంగా సహాయం చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సాను కూల స్పందన లభిస్తుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయంతో సమానంగా ఖర్చు పెరుగుతుంది. ఒక వ్యక్తిగత సమస్య దానంతటదే పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో మీ వ్యూహాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నా లకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో బరువు బాధ్యతలతో పాటు ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్య మైన పనులన్నీ అనుకూలంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గట్టుగా ప్రతిఫలం ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో మంచి ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. ఆస్తికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. మీ మాటకు, చేతకు సర్వత్రా విలువ పెరుగు తుంది. మీ సలహాలు, సూచనలు అధికారులకు ఉపయోగపడతాయి. వ్యాపారంలో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. మొత్తం మీద రోజంతా గౌరవప్రదంగా గడిచిపోతుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబపరంగా చికాకులు ఉండే అవకాశ ముంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్త వుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగం నిలకడగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. పిల్లలతో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తవచ్చు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఒకరిద్దరు స్నేహితులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. బంధు వుల ద్వారా శుభవార్తలు వినడం జరుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లలు మంచి విద్య, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనం దోత్సాహాలు వెల్లి విరుస్తాయి. కొత్త ప్రయత్నాలు చేపట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ ని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. నిరుద్యోగులకు కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది.