Horoscope today: ఈ రాశివారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే ఇబ్బందులు తప్పవు..!

|

Aug 26, 2021 | 7:32 AM

Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ..

Horoscope today: ఈ రాశివారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే ఇబ్బందులు తప్పవు..!
Follow us on

Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. గురువారం పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:

ఈ రాశి వారికి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు మంచి జరుగుతుంది.

వృషభ రాశి:

వ్యాపార విషయాలలో ఈ రాశివారికి ఈ రోజు సంతృప్తి కలిగిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. బంధుమిత్రుల సలహాలు సూచనలు అందుకుంటారు.

మిథున రాశి:

ఈ రాశివారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తుల వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పురోగతి ఉంటంది.

కర్కాటక రాశి:

ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అధికంగా శ్రమించక తప్పదు. పనుల్లో అవాంతరాలు ఏర్పడతాయి. కొత్తగా రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేయడం తప్పదు. సోదరులతో విభేదాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు తప్పవు.

సింహ రాశి:

బంధువులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అగ్రిమెంట్లు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్పులు ఉంటాయి ఆనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఒత్తిడిలు తప్పవు.

కన్య రాశి:

కుటుంబ సభ్యులు, మిత్రులతో సన్నిహితంగా ఉంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

తుల రాశి:

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితులు ఉత్సాహాన్ని నింపుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవరోధాలు తొలగుతాయి.

వృశ్చిక రాశి:

చేసే పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉంటాయి.

ధనుస్సు రాశి:

ఈ రాశివారికి చేసే పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందు ఎదుర్కొంటారు.

మకర రాశి:

వ్యాపారాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా మెరుగు పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు కొన్ని చిక్కలు ఏర్పడతాయి.

కుంభ రాశి:

ఈ రాశివారు చేసే పనులు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. సోదరుల నుంచి ఒత్తిడులు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మీన రాశి:

కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మంచి వార్తలు వింటారు. ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులు, ఉద్యోగస్తులుకు మంచి జరుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం.

Health Tips: గొంతు నొప్పి.. నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..? ఇలా చేయండి.. వెంటనే నయమవుతుంది..!

Onion, Garlic: మొలకెత్తిన ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం మంచిదేనా..? ఎందుకు మొలకలు వస్తాయి..?

Fruits Eat: భోజనం చేసిన తర్వాత పండ్లు తినడం సరైనదేనా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?