Horoscope Today: ఈ రోజు ఏ రాశి స్త్రీలు సంతోషంగా గడుపుతారంటే.. ఆదివారం ఏయే రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Sep 26, 2021 | 6:49 AM

Horoscope Today(September 26-09-2021): రోజుని మొదలు పెట్టాలంటే.. ఈరోజు మన జాతకం ఎలా ఉంది అని ఆలోచించని వారు బహు అరుదు. ఎవరు ఏ పని చేయాలన్నా ఏ పనిని మొదలు పెట్టాలన్నా..

Horoscope Today: ఈ రోజు ఏ రాశి స్త్రీలు సంతోషంగా గడుపుతారంటే.. ఆదివారం ఏయే రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us on

Horoscope Today(September 26-09-2021): రోజుని మొదలు పెట్టాలంటే.. ఈరోజు మన జాతకం ఎలా ఉంది అని ఆలోచించని వారు బహు అరుదు. ఎవరు ఏ పని చేయాలన్నా ఏ పనిని మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉన్నారు.  అంతేకాదు తాము పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో (సెప్టెంబర్ 22)  ఈరోజు ఆదివారం  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనుల్లో వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిలో ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరులకు హాని కలిగించే పనులు చేయడం మానుకోవాలి. కొత్తపనులను చేపట్టే అవకాశం ఉంది.

వృషభ రాశి:ఈ రాశివారికి శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్ధికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.

మిధున రాశి:ఈరాశివారికి ఈరోజు చేపట్టిన పనుల్లో సక్రమంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త పనులు చేపట్టడానికి చక్కని రూపకల్పన చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది. కొత్తపనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.  బంధుమిత్రులను కలుస్తారు. క్రీడాకారులకు రాజకీయ రంగాల్లోని వారికీ అనుకూలంగా ఉంటుంది. స్త్రీలు సంతోషముగా గడుపుతారు.

సింహ రాశి:ఈరోజు ఈరాశివారికి మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆకస్మిక భయాందోళలకు దూరమవుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు మిత్రులతో శత్రుత్వం ఏర్పడే అవకాశముంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దైవ దర్శనానికి ప్రయత్నాలు చేస్తారు. కొత్త పరిచయాలను నమ్మి మోసపోరాడు. సోదరులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. సంఘంలో అప్రదిష్ట రాకుండా జాగ్రత్తపడడం మంచిది.

తులా రాశి: ఈరోజు ఈ రాశివారి మనసు పరిపరివిధాల ఆలోచిస్తూ.. చంచలంగా ఉంటుంది. బంధు మిత్రులతో శత్రుత్వం ఏర్పడకుండా ఉండడం మంచిది. ఆకస్మిక కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది.  చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులు ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.  వ్యాపార రంగంలో లాభాలుంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి రావచ్చు. కొత్తపనులను చేపడతారు. బంధు మిత్రుల సహకారం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది.

ధనుస్సు రాశి:ఈరోజు ఈ రాశి వారు మానసిక ఆందోళనకు గురవుతారు. వృత్తిరీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి. లేదంటే చేపట్టిన పనులల్లో ఆటంకాలు ఏర్పడతాయి. తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మానసిక ఆందోళన చెందుతారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశి వారికి మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర నిందలతో అపకీర్తి వచ్చే అవకాశం ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలను వేస్తారు.

కుంభ రాశి:ఈరాశి వారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కనుక కొత్తగా పనులు చేపట్టడం మంచికాదు. ఇంట్లో అనేక మార్పులు చోటు చేసుకుంటారు. దీంతో ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం అవసరం.

మీన రాశి:ఈ రాశివారు ఈరోజు చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. స్థిరాస్తికి సంబంధించి ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కొత్త వస్తువు. వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

Also Read:

ఈ 4 రాశుల వ్యక్తులు లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటారట..! మీరు ఈ రాశికి చెందినవారేనా..?