దిన ఫలాలు (నవంబర్ 22, 2023): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కొత్త కార్యక్రమాలను చేపడతారు. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు బాగా సహకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మిథున రాశి వారికి బంధుమిత్రులతో అకారణంగా మాట పట్టింపులు ఏర్పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కొత్త కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసు కుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయా నికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు కొంత వరకూ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు బాగా సహకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అన్ని విధాలా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన శుభ ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. వ్యాపారాల్లో సంపాదన బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. పొరుగువారితో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగిపోతాయి. బంధుమిత్రులతో అకారణంగా మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలస్యాలు తప్పకపోవచ్చు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలు న్నాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహం కలిగి స్తాయి. ఇంటా బయటా చికాకులు తప్పకపోవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్ర మాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. బకాయిలు, బాకీలు చేతికి అందు తాయి. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
అనుకోకుండా ఇంటికి దగ్గర బంధువులు వచ్చే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పిల్లల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కొత్త పరిచయాలు బాగా పెరుగుతాయి. శుభకార్యాలకు కుటుంబ సమేతంగా హాజరవుతారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఆదాయంలో మెరుగుదల కనిపిస్తోంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యయప్రయాసలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాలు గడించడం జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
అవసరానికి తగ్గట్టుగా డబ్బు సమకూరుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, అవరోధాలు ఉంటాయి. దూర ప్రాంత మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి సహా యం లభిస్తుంది. ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితులకు అండగా నిలబడ తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల విష యంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కబెడ తారు. వ్యాపారాల్లో భాగస్వాముల నుంచి సమస్యలు తలెత్తవచ్చు. విద్యాపరంగా సంతానం పురో గతి సాధిస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి జీవితంలో బాగా డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. బంధు వర్గం నుంచి శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో తప్పకుండా అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగు తాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఒకరిద్దరు బంధువులకు సహాయం చేయాల్సి వస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. చేపట్టిన పనులలో ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుతాయి. దైవ సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వినడం జరుగుతుంది. సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం ఉంటుంది.