Horoscope Today: ఈ రోజు ఈరాశివారు కీలక పనులు వాయిదా వేయడం మంచిది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Oct 17, 2022 | 6:24 AM

మంచి జరుగుతుందా.. ఏమైనా చెడు జరుగుతుందా అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 17 వ తేదీ )సోమవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఈ రోజు ఈరాశివారు కీలక పనులు వాయిదా వేయడం మంచిది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us on

Horoscope Today (17-10-2022): రోజుని మొదలు పెట్టేముందు చాలామంది ముందుగా అలోచించేంది.. ఈరోజు తమకు ఎలా ఉంటుంది.. మంచి జరుగుతుందా.. ఏమైనా చెడు జరుగుతుందా అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 17 వ తేదీ )సోమవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారికి ఈరోజు ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు అమలు చేసే విషయాలను వింటారు. అభివృద్ధికి సంబంధించిన పనులను చేపడతారు. బంధు, మిత్రులతో సంతోషముగా గడుపుతారు. ఆత్మవిశ్వాసం పెంచే శుభవార్త వింటారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక పనులను వాయిదా వేయడం మంచిది. కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. మానసిక విచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారికీ అభివృద్ధికి సంబదించిన వార్త వింటారు. ఆనందాన్ని ఇచ్చే వార్త వింటారు. బంధు, మిత్రులతో తగిన జాగ్రత్తలు వహించాలి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఎప్పటి నుంచి వాయిదా పడుతున్న పని పూర్తి అవుతుంది. మీ పని తీరుతో అందరి ప్రశంసలను అందుకుంటారు. ముఖ్యమైన పని దాదాపు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనులకు సంబంధించి పెద్దలను కలుస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టాన్ని నమ్ముకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగాల్సి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభఫలితాలను పొందుతారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంది. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకుని వెళాల్సి ఉంటుంది.  ఆ యా రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రుల అండతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. బాధను కలిగించే వార్తను వింటారు. కష్టపడి పనిచేస్తే లక్ష్యాలను అందుకుంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. మొదలు పెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పోరాడి విజయాన్ని సాధిస్తారు. పట్టుదల వదలకండి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇతరులకు సాయం చేయాలనే ఆలోచనే మిమ్మల్ని గొప్పగా నిలబెడుతుంది. శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మానసిక ధైర్యంతో చేపట్టిన పనులు మంచిని చేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ముందుకు సాగుతారు. శుభకాలం. ఒక కీలక విషయంలో మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రమతో కూడిన ఫలితాలను అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. అనవసర ధనవ్యయం చేస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం