Today Horoscope 16-02-2021: ఫిబ్రవరి 16 రాశి ఫలాలు.. ఆ రాశి వారు చేసే పనుల్లో జాగ్రత్తలు అవసరం.. అప్పులు పెరిగే అవకాశం

Today Horoscope 16-02-2021: ఈ రోజు అంటే ఫిబ్రవరి 16 మంగళవారం సాయంత్రం చంద్రుడు మీనంలో సంచరించనున్నాడు. చంద్రుడు ఈ రాశిలో రావడం వల్ల వసంత పంచమి సరస్వతి ..

Today Horoscope 16-02-2021: ఫిబ్రవరి 16 రాశి ఫలాలు.. ఆ రాశి వారు చేసే పనుల్లో జాగ్రత్తలు అవసరం.. అప్పులు పెరిగే అవకాశం
Follow us
Subhash Goud

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 16, 2021 | 9:28 AM

Today Horoscope 16-02-2021: ఈ రోజు అంటే ఫిబ్రవరి 16 మంగళవారం సాయంత్రం చంద్రుడు మీనంలో సంచరించనున్నాడు. చంద్రుడు ఈ రాశిలో రావడం వల్ల వసంత పంచమి సరస్వతి పూజా దినాన చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. అంతేకాకుండా అనేక రాశుల ప్రజలకు ఈ పవిత్ర యోగం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ రోజు వివిధ రాశుల వారు మంచి ఫలితాలు సాధించేందుకు కొన్ని జాగ్రత్తలు వహిస్తూ ముందుకెళ్లడం ఎంతో మంచిది. ఈ రోజు రాశిఫలాల్లో ఎవరికి ఎలా ఉందో చూద్దాం..

మేష రాశి:

మేషరాశివారు మంగళవారం రోజు అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేయడంలో ప్రయత్నిస్తుంటారు. కానీ తొందర పడకుండా నెమ్మదిగా పనులు పూర్తి చేసుకోడం చాలా మంచిది. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు చేసే పనుల్లో కాస్త జాగ్రత్తగా వహిస్తూ ముందుకెళ్లడం మంచిది. ఈ రాశివారు ఈ రోజు సుబ్రమణ్య స్వామికి పూజించడం ఎంతో మంచిది.

వృషభరాశి:

వృషభరాశి గలవారు ఈ రోజు కీలకమైన బాధ్యతలు చేపట్టి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాలు కూడా జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇటువంటి పనులు చేసే ముందు ముందస్తుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ రాశివారు పేదవారికి అన్నదానం చేస్తే చాలా మంచిది.

మిథున రాశి:

మిథున రాశి వారు చేయాల్సిన పనుల్లో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. పనులు కాస్త చికాకు పెట్టిస్తుంటాయి. అప్పులు కూడా పెరిగిపోతాయి. ఈ రోజు చేసే పనుల్లో చాలా ఆలోచించి జాగ్రత్తతో ముందుకు వెళ్లాలి. ఇష్టదేవతకు పాలు, పండ్లు సమర్పించడం చాలా మంచిది.

కర్కాటక రాశి:

ఈ రాశివారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు వస్తుంటాయి. దైవ చింతన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రాశివారు ఈ రోజు పరమేశ్వరునికి అభిషేకం చేస్తే చాలా మంచిది.

సింహ రాశి:

సింహరాశి వారు ఈ రోజు చేసే పనుల్లో ఉత్సాహంగా ఉంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ రాశి వారు మహాలక్ష్మీ అమ్మవారికి తీపి పదార్థాలతో నైవేద్యంగా నివేదించడం చాలా మంచిది.

కన్య రాశి:

ఈ కన్యరాశి వారు ఈ రోజు చేసే పనుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించిన అంశాల్లో కొంత గందరగోళం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు మహాలక్ష్మీ అమ్మవారిని పూజించడం ఎంతో మంచిది.

తుల రాశి:

ఈ రాశివారికి ఉద్యోగానికి సంబంధించిన అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు మెండుగా ఉంటాయి. గౌరవంతో కూడిన కొన్ని బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజు లక్ష్మీగణపతిని పూజించడం ఎంతో శ్రేయస్కరం.

వృశ్చిక రాశి:

ఈ రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అయితే ఆరోగ్య విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మహాలక్ష్మీ అమ్మవారికి చక్కెర పొంగలితో నైవేద్యం సమర్పించడం చాలా మంచిది.

ధనుస్సు రాశి:

ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఒప్పందాల విషయంలో సమీక్షలు జరిగే అవకాశాలుంటాయి. ఈ రాశివారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. చేసే పనుల్లో విజయం సాధించే అవకాశాలుంటాయి. ఈ రాశి వారు ఈ రోజు మొలకెత్తిన పెసర్లను దానం చేయడం చాలా మంచిది.

మకర రాశి:

మకర రాశి వారు వ్యాపారం విషయంలో లాభాలు పొందే అవకాశాలుంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేసే పనుల్లో పురోగతి సాధిస్తారు. శివారాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

కుంభ రాశి:

ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు ఖర్చులు కూడా పెరిగే అవకాశాలుంటాయి. ఈ రాశివారు మాతంగి స్తోత్ర పారాయణం చేసే ఎంతో మేలు జరుగుతుంది.

మీన రాశి:

ఈ రాశి వారుఈ రోజు క్రమ శిక్షణతో వ్యవహరించాల్సి ఉంటుంది. పారిశ్రామిక వ్యక్తులను కలిసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ రాశి వారు మరిన్ని ఫలితాలు పొందాలంటే మహాగణపతిని దర్శించుకోడం చాలా మంచిది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!