మేష రాశి..
ఈరోజు వీరికి కుటుంబసభ్యులతో విభేధాలు ఏర్పడే అవకాశం ఉంది. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అవసరం. స్నేహితులను కలుసుకుంటారు.
వృషభ రాశి..
ఈరోజు వీరు చేపట్టిన అన్ని పనులను పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.శుభవార్తలు వింటారు.
మిథున రాశి..
పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. పిల్లలపట్ల జాగ్రత్తలు అవసరం. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబంలో విరోధాలు తగ్గుతాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
కర్కాటక రాశి..
ఈరోజు వీరికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు అవసరం. చెడు సహవాసానికి దూరంగా ఉండాలి.
సింహ రాశి..
ఈరోజు వీరికి చేపట్టిన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సమస్యలు తద్గుతుంటాయి. కొత్త పనులను ప్రారంభించకూడదు. ప్రయాణాలు చేస్తారు.
కన్య రాశి..
ఈరోజు వీరు దూర ప్రయాణాలు చేస్తారు. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. చేపట్టిన పనులు వాయిదాపడే అవకాశం ఉంది.
తులరాశి..
ఈరోజు వీరికి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంటాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసిక ఆందోళన ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కీళ్ల నొప్పులు వేదిస్తాయి. మానసిక ఆందోళన ఉంటుంది. కుటుంబసభ్యులతో సమయం కేటాయించడం మంచిది.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరు మానసిక ఆందోళన తగ్గించుకోవడం అవసరం. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. కుటుంబవిషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు.
మకర రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులలను వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడుతుంది. చేపట్టిన పనులను వాయిదా వేస్తారు.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోంటారు.
కుంభరాశి..
ఈరోజు వీరు దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబసౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. శుభవార్తలు వింటారు. విందులు, వినోదాల్లో పాల్గోంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
మీన రాశి..
ఈరోజు వీరికి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి.