Horoscope Today: ఈ రాశివారు ప్రయాణాల విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. ఇబ్బందులు తప్పవు

|

Jun 11, 2021 | 6:39 AM

Horoscope Today: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు

Horoscope Today: ఈ రాశివారు ప్రయాణాల విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. ఇబ్బందులు తప్పవు
Follow us on

Horoscope Today: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు చాలా మంది ఉంటారు. రోజును ప్రారంభించే ముందు ఏదైనా పనులు చేసే ముందు తమ తమ రాశి ఎలా ఉందో చూసుకుని బయటకు వెళ్లేవారు చాలా మంది ఉంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూన్ 11న) శుక్రవారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి

ఈ రాశివారు ఈ రోజు మధ్యవర్తిత్వం వహించే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మంచి ఫలితాలు రావాలంటే పేదవారికి ఆకు కూరలు ధానం చేయడం మంచిది.

వృషభరాశి

ఆరోగ్య విషయాలలో ఈ రాశివారు జాగ్రత్త తీసుకోవడం మంచిది. పలు విషయాలలో ఆచీతూచి అడుగులు వేయాలి. గురుపూజ దర్శనం ఎంతో మేలు చేస్తుంటుంది.

మిథున రాశి

ఈ రాశివారు దూర ప్రయాణాలు చేస్తుంటారు. ఆనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శిస్తుంటారు. వారికి ధైర్యం చెబుతారు. దుర్గదేవి పారాయణం ఎంతో మేలు చేస్తుంది.

కర్కాటక రాశి

ఈ రాశివారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేకపోతే ఆనారోగ్యం తలెత్తే అవకాశం ఉంది. అన్ని పనులు చేసే ముందు జాగ్రత్తలు వహించడం మంచిది. అమ్మవారిని దర్శించుకోవడం మంచిది.

సింహరాశి

పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. శివాలయాన్ని దర్శనం చేసుకోవడం మంచిది.

కన్యరాశి

ఈ రాశివారు తక్కువ శ్రమతో ఎక్కులా లాభాలు పొందుతారు. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

తులారాశి

ఈ రాశివారికి ఈ రోజు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ప్రతి విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. అమ్మవారికి పూజలు చేయడం మంచి ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి

ఈ రాశివారికి వ్యాపార వ్యవహరిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శ్రీరామ పారాయణం ఎంతో మేలు చేస్తుంటుంది.

ధనుస్సు రాశి

ఈ రాశివారికి ఈ రోజు రుణ సంబంధిత విషయాలలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఎంతో మేలు చేస్తుంటుంది.

మకరరాశి

ఈ రాశివారు పిల్లల ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలని, అనుకోని ప్రయాణాలు చేస్తుంటారు. దుర్గమ్మను దర్శనం చేసుకోవడం మంచిది.

కుంభరాశి

గృహ నిర్మాణ కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర పనుల్లో కూడా ఆచీతుచి అడుగులు వేయాలి. లలితనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల మేలు చేస్తుంటుంది.

మీనరాశి

ఈ రాశివారికి ఈ రోజు పరిచయాలు బలోపేతం చేస్తాయి. అనవసర విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మవారి దర్శనం మేలు చేస్తుంటుంది.

ఇవీ కూడా చదవండి

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం తిరుమల కొండపై గదుల రిజిస్ట్రేషన్ కోసం 6 చోట్ల కేంద్రాలు..

Kapaleshwar Mandir: శివుడు బ్రహ్మహత్యా దోషాన్ని స్నానమాచరించి పోగొట్టుకున్న పవిత్ర క్షేత్రం ఎక్కడో తెలుసా