Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు..12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Apr 10, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 10, 2024): మేష రాశి వారికి బుధవారం రోజంతా బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి పని ఒత్తిడి కూడా బాగానే ఉంటుంది. మిథున రాశి వారు పట్టుదలగా వ్యవహరించి పనులు సాధించుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు..12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Horoscope Today 09th April 2024
Follow us on

దిన ఫలాలు (ఏప్రిల్ 10, 2024): మేష రాశి వారికి బుధవారం రోజంతా బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి పని ఒత్తిడి కూడా బాగానే ఉంటుంది. మిథున రాశి వారు పట్టుదలగా వ్యవహరించి పనులు సాధించుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా బాగా అనుకూలంగా ఉంది. కొద్ది వ్యయ ప్రయాసలతో పనులన్నీ పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం గురించి సోదరులతో చర్చిస్తారు. ఉద్యోగం చాలావరకు సానుకూలంగానే సాగిపోతుంది. మీ బాధ్యతలు పూర్తి చేయడంతో పాటు అధికారులకు, సహోద్యోగులకు సహాయపడతారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు బాగా బిజీ అయి, ఆర్థికంగా లాభం పొందుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది. పని ఒత్తిడి కూడా బాగానే ఉంటుంది. వృత్తి జీవితం బాగానే సాగిపోతుంది. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారులకు బాగా దగ్గరవుతారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశముంది. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుని సరదాగా గడుపు తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

పట్టుదలగా వ్యవహరించి పనులు సాధించుకుంటారు. రావలసిన సొమ్మును, బాకీలను కొద్ది ప్రయత్నంతో వసూలు చేసుకుంటారు. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఒకటి రెండు ప్రధాన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులు కొద్ది ప్రయ త్నంతో సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

మాట తొందరపాటుతో సమస్యలు కొని తెచ్చుకునే అవకాశముంది. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం మీద దృష్టి పెడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, స్నేహితుల మీద ఎక్కువగానే ఖర్చు చేయడం జరుగుతుంది. గృహ, వాహనాల కొనుగోలు విషయాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉన్నా ప్రతిఫలం కూడా బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రోజంతా అనుకూలంగానే సాగిపోతుంది. ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి. ఒక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రాథాన్యం పెరుగుతుంది. జీతభత్యాలకు సంబంధించి శుభ వార్త వింటారు. వృత్తి జీవితం లాభసాటిగా సాగిపోతుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత తప్పక పోవచ్చు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ప్రస్తుతానికి ఇతరులకు డబ్బు ఇవ్వడం, తీసుకోవడం శ్రేయస్కరం కాదు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కొన్ని ముఖ్యమైన పనుల్ని ఎంతో శ్రమతో పూర్తి చేస్తారు. మీ వల్ల సహాయం పొందినవారు ఇప్పుడు ముఖం చాటేసే అవకాశముంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కొత్త ఆదాయ మార్గాలు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గ్రహలన్నీ చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు ఉంటుంది. అధికా రుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలకు లోటుండదు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ప్రమోషన్ మీద బదిలీ అయ్యే సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

చిన్నా చితకా ఇబ్బందులుంటే ఉండవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత సమస్యలు చికాకు పెడతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశముంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు నిలకడగా, ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందే సూచనలున్నాయి. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆశించిన శుభవార్తలు అందుతాయి. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆదాయ మార్గాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబసమేతంగా పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా సజావుగా లాభసాటిగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరు గుతాయి. ఆరోగ్యా నికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యో గంలో ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి జీవితం బాగా పురోగతి చెందు తుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశముంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందు తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం బాగా పెరిగే అవకాశముంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రోజంతా శ్రమ, ఒత్తిడి, తిప్పట తప్పకపోవచ్చు. ఇంటా బయటా బాధ్యతలు, పని భారం బాగా పెరిగే అవకాశముంది. కాస్తంత ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. ఉద్యోగ జీవితంలో ఆదరణ పెరుగుతుంది కానీ, పని ఒత్తిడి బాగానే ఉంటుంది. శరీరానికి విశ్రాంతి కరువవుతుంది. వృత్తి జీవితం లాభసాటిగా, ఆశాజనకంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఇంటా బయటా మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగంలో కూడా గౌరవాభిమానాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కొత్త గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందు తాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించాలనే ఆలోచన చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొందరు బంధువులకు సహాయం చేయడం జరుగుతుంది. మిత్రులతో ద్వారా ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులు తప్పకుండా శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.