Horoscope Today: ఆ రాశి వారు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు..

| Edited By: Janardhan Veluru

Mar 06, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మార్చి 6, 2024): ఉద్యోగంలో మేష రాశి వారి మాట చెల్లుబాటు అవుతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన అండదండలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు..
Horoscope Today 06th March 2024
Follow us on

దిన ఫలాలు (మార్చి 6, 2024): ఉద్యోగంలో మేష రాశి వారి మాట చెల్లుబాటు అవుతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన అండదండలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా చాలావరకు అనుకూల ఫలితాలనిస్తాయి. లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. బంధు మిత్రులతో ఏవైనా వివాదాలుంటే అవి పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాల్లో విపరీతంగా ఒత్తిడి, శ్రమ కనిపిస్తాయి. కుటుంబంలో పిల్లల మీద బాగా ఎక్కువగా ఖర్చు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుంచి అవసర సమయంలో సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన అండదండలు లభిస్తాయి. సహోద్యోగులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఇష్టమైన బంధుమిత్రులు ఇంటికి రావడం జరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్ర మాల్లో పాల్గొంటారు. పిల్లలు చదువుల్లో పురోగతి చెందుతారు. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అనుకోకుండా ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. మిత్రులకు సహా యం చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలో బిజీ జీవితం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో నిలకడగా లాభాలు ఆర్జిస్తారు. వ్యక్తి గతంగా కొద్దిగా పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవాభిమానాలు పెరగడం, ప్రముఖులతో పరి చయాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగు తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతారు. శుభ కార్యాల మీద లేదా పుణ్య కార్యాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సోదర వర్గంతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు సజావుగా సాగిపో తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు సమస్యలను జీవిత భాగస్వామితో కలిసి పరి‌ష్కరించుకుంటారు. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. ఒకరిద్దరు మిత్రులకు అండగా నిలబడతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఒకటి రెండు కీలకమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయానికి లోటు ఉండదు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు ప్రయో జనం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెడ తాయి. ఉపయోగ కరమైన పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులతో విందులో పాల్గొంటారు. స్థాన చలనానికి, స్థలం మార్పుకు అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు పరవాలేదని పిస్తాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా మారతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు నిదానంగా ముందుకు సాగుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలలో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉన్నతాధికారుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొందరు స్నేహితులు ఆర్థికంగా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు ఎంతగానో ఉపకరిస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రతి చోటా శ్రమాధిక్యంత ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. నిరు ద్యోగులు దూర ప్రాంత సంస్థల నుంచి ఆఫర్లు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొం టారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆర్థిక వివాదాలను తగ్గిం చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆదాయానికి లోటుండదు. కొత్తగా వ్యాపారాలు చేపట్టే అవ కాశం ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వ్యక్తిగత, కుటుంబ సమ స్యల్ని చాలావరకు తగ్గించుకుంటారు. ప్రయాణాల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికి రాదు. ఎవరికీ హామీలు ఉండవద్దు.