దిన ఫలాలు (జనవరి 3, 2024): మేష రాశి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు వెడతాయి. కొద్ది శ్రమతో ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చర్యలు చేపట్టడం చాలా అవసరం. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. తొందరపాటుతనంతో వ్యవహరించవద్దు. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు సాయం చేయడం జరుగు తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగుల మీద ప్రత్యేక బాధ్యతలు పడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆధ్యా త్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలంగా నెరవేరుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రాదను కుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలతో కుటుంబ సభ్యుల సలహాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభి స్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అష్టమ గురువు కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశ కావేషాలకు ఇది సమయం కాదు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా చాలావరకు బాగానే గడిచిపోతుంది. ఉద్యోగంలో మాత్రం కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బాధ్యతలను, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొందరు స్నేహితులు సహాయ సహ కారాలు అందిస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యవహార జయం ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
రోజంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగు తాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయం పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వసూలు కాని బాకీలు ఇప్పుడు వసూలు అవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా మీ మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ప్రస్తుతం పంచమ, తృతీయ స్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా అనుకూల వాతావ రణం ఉంటుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపా రాలు కూడా ఊపందుకుంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవు తాయి. పెద్దల జోక్యంతో స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యో గంలో మీ సలహాలకు, సూచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఏ ప్రయ త్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఉద్యోగుల ప్రతిభకు, శ్రమకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ కార్యా లకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వస్త్రాభరణాలు కొంటారు. వ్యయ ప్రయాసలకోర్చి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ సంబంధమైన పనుల మీదా, సొంత పనుల మీదా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ముందుకు సాగుతాయి. రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం జరుగుతుంది. వ్యాపారులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుం టారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రతిఫలం లభిస్తుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.