Horoscope Today: ఈ రాశివారు ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటుంటారు. ప్రతి రోజు ఉదయం ఆ రోజు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు...

Horoscope Today: ఈ రాశివారు ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు

Updated on: Feb 19, 2022 | 6:46 AM

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటుంటారు. ప్రతి రోజు ఉదయం ఆ రోజు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తారు. దీంతో చాలా మంది తమ తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. ఫిబ్రవరి 19 (శనివారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:

ఈ రాశివారు ఇతరుల సహకారాలు పొందుతారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభ రాశి:

కొందరి ప్రవర్తన వల్ల బాధ కలిగిస్తాయి. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.

మిథున రాశి:

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధికారులు, పెద్దలకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరిగుతాయి. దూర ప్రాంతాలు చేస్తారు.

కర్కాటక రాశి:

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆటంకాలు ఎదురవుతాయి. ఏదైనా పనులు చేపట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి:

కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది.

కన్య రాశి:

కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. కొన్ని విషయాలు మిమ్మల్ని బాధిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.

తుల రాశి:

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాలలో ప్రత్యేక శ్రద్ద పెడతారు. బంధుమిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

వృశ్చిక రాశి:

కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. శత్రువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది.

ధనుస్సు రాశి:

ప్రారంభించిన పనులలో ఊహించని ఫలితాలు ఉంటాయి. అనవసరమైన విషయాలను పట్టించుకోకపోవడం మంచిది. రోజువారి పనులపై ప్రత్యేక శ్రద్ద వహించడం మంచిది.

మకర రాశి:

ముందుచూపుతో పని చేయడం మంచిది. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అధికారులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు ఉంటాయి.

కుంభ రాశి:

ప్రారంభించిన పనులలో అంతరాయం ఏర్పడకుండా ముందుకెళ్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రద్ద వహించడం తప్పనిసరి. అనవసరమైన విషయాలలో సమయాన్ని వృథా చేయకండి.

మీన రాశి:

ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Chanakya Niti: పిల్లల ముందు తల్లిదండ్రులు ఈ నాలుగు విషయాలను గుర్తు పెట్టుకుని మెలగాలంటున్న చాణక్య..

Tirumala Laddu: ఇక నుంచి తిరుమల శ్రీవారి లడ్డూకు మరింత రుచి.. ఎందుకో తెలుసా..?

IRCTC Tirupati Tour: తిరుమల వెళ్లే వారికి ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్‌ ప్యాకేజీ