
దిన ఫలాలు (అక్టోబర్ 10, 2026): మేష రాశి వారికి మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగం ప్రోత్సాహకరంగా సాగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా పురోగమిస్తాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో శ్రద్ధ వహించడం మంచిది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆద్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది.
ఉద్యోగం ప్రోత్సాహకరంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ఊహించని వస్తు లాభం ఉంటుంది. బంధువులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వ్యక్తిగత ఆర్థిక సమస్యలు తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల్లో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.
వృత్తి, ఉద్యోగాల్లో శుభ వార్తలు వింటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా సాగుతాయి. సొంత ఇంటి ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి రావడం జరుగుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది.
ఉద్యోగాల్లో చిన్నపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. వృత్తి జీవితం ఆశించిన విధంగా సాగిపో తుంది. వ్యాపారాల్లో లాభాలు మెరుగ్గా ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కివస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ వాతావరణం సామర స్యంగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. బంధు వర్గం నుంచి శుభవార్తలు వింటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. ఖర్చుల విష యంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం, ఆరోగ్యం మెరుగ్గా ఉంటాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
వృత్తి, వ్యాపారాల్లో కష్టనష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగాలు చాలావరకు ప్రోత్సాహక రంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇష్టమైన మిత్రు లతో సరదాగా గడుపుతారు. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. మీ సలహాలు, సూచనలకు సర్వత్రా విలువ ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సకా లంలో పూర్తవుతాయి. ప్రస్తుతానికి దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ఆచితూచి ఖర్చు చేయవలసి ఉంటుంది. బంధువులు ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తొలగిపోయే అవకాశముంది.
ఉద్యోగాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఇంట్లో సౌకర్యాల మెరుగుదల మీద దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయ టపడతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆదాయానికి లోటుండదు. పిల్లల విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయటా శ్రమ తప్పకపోవచ్చు. మీ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆస్తి సమస్యలు చక్కబడే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు పూర్తిగా సఫలమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారాల్లో కలిసివస్తుంది.
ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని అవకాశాలు ఉత్సాహాన్ని పెంచుతాయి. ఆదాయ మార్గాలు మెరుగ్గా సాగుతాయి. పిల్లల విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభ పరిణామం ఒకటి చోటు చేసుకునే అవకాశం ఉంది. పిల్లల్లో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. తోబుట్టువులతో సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.