Horoscope Today: ఈ రోజు ఈ రాశివారికి పిల్లల విషయంలో హ్యాపీ.. ఎవరు ఉద్యోగ, వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటే..!

|

Apr 14, 2021 | 6:32 AM

Horoscope Today 14th April 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి...

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారికి పిల్లల విషయంలో హ్యాపీ.. ఎవరు ఉద్యోగ, వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటే..!
Rashiphalalu
Follow us on

Horoscope Today 14th April 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అప్పుడు ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ రోజు ఏప్రిల్ 14 బుధవారం రోజున ఏ రాశివారికి ఏ విధంగా ఉందొ తెలుసుకుందాం.

మేషరాశి..
ఈరోజు వీరు ఆహార విహారధుల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాలను కొంత నాణ్యతగా గుర్తించడం మంచిది. ఈరోజు వీరికి శివాభిషేకం, శివార్చన మేలు చేస్తుంది.

వృషభ రాశి..
ఈరోజు చేపట్టిన వ్యవహారిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. నవగ్రహ అర్చన మేలు చేస్తుంది.

మిధున రాశి..

ఈరోజు సంఘంలో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పేదవారికి ఆహారం పదార్ధాలు దానం చేయడం మంచిది.

కర్కాటక రాశి..
ఈరోజు సాంఘిక జన సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రమ పెరిగినప్పటికీ ప్రయోజనాలు పొందుతారు. అమ్మవారి ఆరాధన మంచిది.

సింహరాశి..
ఈరోజు వ్యక్తిగత కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. అప్పులు చేసే పరిస్థితి కల్పిస్తుంది. పేదవారికి కాయగూరలు దానం మంచిది.

కన్యా రాశి..
ఈ రాశివారు ఈరోజు ఆర్ధిక లావాదేవీలు సాధారణంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేసే వీలుంది. ఆంజనేయస్వామి కి తమలపాకుల అర్చన మంచిది.

తులారాశి..
ఈ రాశివారు ఈరోజు స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైనటు వంటి ఆటంకాలను అధిగమించడం మంచిది. మహాలక్ష్మి అమ్మవారికి తీపి పదార్ధాలను నివేదన చేయండి.

వృశ్చిక రాశి..
ఈరోజు కుటుంబాలతో వ్యవహరించే సమయంలో జాగ్రత్తగాఉండాలి. ఎదుటివారి యొక్క అభిప్రాయాలను గౌరవించడం మంచిది. శివార్చన మేలు చేస్తుంది. .

ధనుస్సు రాశి..
ఈరోజు ఉద్యోగవ్యాపార లాభాలు కలిసి వస్తుంటాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. పంచాక్షరీ మంత్రం మేలు చేస్తుంది.

మకర రాశి..
ఈ రాశివారు ఈరోజు షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోనటువంటి ఇబ్బందులు కలగవచ్చు. లక్ష్మీనరసింహస్వామి దర్శనం మేలు చేస్తుంది.

కుంభరాశి..
ఈరోజు వ్యవహారిక విషయాలల్లో చక్కని శుభఫలితాలు పొందుతారు. పిల్లల చదువుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. విష్ణు స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మీనరాశి..
ఈరోజు పలురకాల ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమీక్షలు చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచుకోగలుగుతారు. ఈరాశివారు ఈరోజు శివారాధన చేసుకుని పేదవారికి అన్నదానం చేయడం మంచిది.

 

Also Read: ఎస్‌బీఐకి షాకిచ్చిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌.. హోమ్‌ లోన్స్‌ తీసుకునే కస్టమర్లకు తీపి కబురు

 స్వల్పంగా పెరుగుతున్న బంగారం ధరలు… దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..