Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థికపరంగా అదృష్టం కలిసొస్తుంది.. నేటి రాశి ఫలాలు (March 10, 2023)

| Edited By: Ravi Kiran

Mar 10, 2023 | 6:07 AM

Daily Horoscope Today: 12 రాశుల వారికి శుక్రవారం (మార్చి 10, 2023) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థికపరంగా అదృష్టం కలిసొస్తుంది.. నేటి రాశి ఫలాలు (March 10, 2023)
Rashi Phalalu
Image Credit source: TV9 Telugu
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆధ్యాత్మిక విషయాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. తనకు మాలిన ధర్మంగా ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగం పరిస్థితి బాగానే ఉంటుంది. అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. వ్యాపారులు కొద్దిగా లాభాలు గడిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇవి కూడా చదవండి

ఆర్థికపరంగా కొద్దిపాటి అదృష్టం కలిసి వస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొందరు స్నేహితుల నుంచి ఆర్థిక సహాయానికి ఒత్తిడి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు వెళతారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ పరంగా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వినటానికి అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు వెళతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక లావాదేవీలు వల్ల కొన్ని మంచి ప్రయోజ నాలు అనుభవానికి వస్తాయి. కొందరు మిత్రు లను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో తిప్పట ఉంటుంది. ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉంటుంది కానీ శరీరానికి విశ్రాంతి అవసరం. అదనపు ఆదాయానికి ప్రయత్నాలు సాగిస్తారు. విద్యార్థులకు బాగుంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కొద్ది ప్రయత్నంతో అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఐటీ రంగంలోని వారికి అవకాశాలు పెరుగుతాయి. పిల్లలు చదువుల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక విషయాలు నిలకడగా ఉంటాయి. దగ్గర వారికి సహాయం చేస్తారు. ఉద్యోగపరంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. దూరప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. వాహన యోగానికి అవకాశం ఉంది. వ్యక్తిగత వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఉద్యోగం విషయంలో మంచి ఆఫర్ అందుతుంది. ఆశించిన స్థాయిలో పిల్లలు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా కొనసాగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

సంపాదన కొద్దిగా పెరుగుతుంది. అయితే అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగంలో అధికారులు కారణంగా కొన్ని చికాకులు ఎదురవుతాయి. వ్యక్తిగత విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కొన్ని సమస్యల విషయంలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఆదాయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొండి
బాకీలను వసూలు చేసే పనిని చేపడతారు. ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆశించిన స్థాయిలో సంపాదన పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం మంచిది కాదు. పడుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా హోదా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ లక్ష్యాలను పూర్తి చేస్తారు. సహచరుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. పిల్లలు చదువులలో బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పొదుపు పాటిస్తారు. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగ పరంగా బాధ్యతలు పెరిగి శారీరక శ్రమకు గురవుతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. కొందరు బంధువులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

-కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య పండితులు
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..