Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశులవారికి మంగళవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయో చూశారా..?
దిన ఫలాలు (జూన్ 30, 2026): ఈ రోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది? మేషం నుంచి మీనం వరకు మంగళవారం ఎలా ఉండబోతుంది... 12 రాశుల వారి పూర్తి దినఫలాలను ఈ కథనంలో తెలుసుకోండి.

Daily Horoscope Today
దిన ఫలాలు (జూన్ 30, 2026): మేషం రాశి వారికి రాశ్యధిపతి కుజుడు ధన స్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. వృషభం రాశి వారు ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. మిథునం రాశి వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు (మంగళవారం) ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడు ధన స్థానంలో ఉండడం, గురు, శుక్ర, బుధ గ్రహాలు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబం మీద ఖర్చులు బాగా పెరగవచ్చు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు తృతీయంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో కలవడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. ఆదాయపరంగా పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగి పోతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. అప్రయత్న ధన ప్రాప్తికి అవకాశంఉంది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడితో పాటు గురు, శుక్రులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం చోటు చేసుకుంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు పూర్తిగా విజయవంతం అవుతాయి.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): గురు, కుజ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలు, సంతృప్తికరంగా, సకాలంలో పూర్తవుతాయి.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి, కుజుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులకు అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఐ.టి నిపుణులు బాగా బిజీ అవుతారు. ఉద్యోగం విషయంలో ఎటువంటి ప్రయత్నం అయినా కలిసి వస్తుంది. బంధుమిత్రులతో విందులు వినోదాలకు ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. సోదర వర్గంతో అనుకోకుండా స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): లాభ స్థానంలో శుక్ర, బుధ, గురు గ్రహాల కలయిక వల్ల లాభాలపరంగా వృత్తి, వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గురు, శని, శుక్ర, బుధ గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉంటున్న బంధువులతో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): రాశ్యధిపతి కుజుడు, భాగ్య స్థానంలో గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం పెరు గుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు, ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కా రమవుతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రవి, కుజ, రాహువుల పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా చాలావరకు అను కూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు, ఆర్థిక విషయాల్లో సమయం అన్నివిధాలుగానూ అనుకూలంగా ఉంది. వ్యాపారాలు కూడా అంచనాకు మించి లాభాలు అందిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు బాగా సానుకూలం అవుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ, రోజంతా చాలావరకు సానుకూలంగానే గడిచిపోతుంది. శని, శుక్ర, గురు, బుధ గ్రహాల అనుకూలత వల్ల లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొన్ని కీలకమైన ఆర్థిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.
- కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కుజ, రవి గ్రహాల అనుకూలత వల్ల కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు బాగా లబ్ధి పొందుతారు. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండి, శుక్ర, బుధులతో యుతి చెందడం వల్ల ఏ చిన్న ప్రయ త్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనుల్ని ఎవరి సహాయమూ లేకుండా పూర్తి చేయగలుగుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఏమాత్రం తీరిక ఉండదు.
Follow Us