జూలై 5 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ధనలాభం..మీ రాశికి ఇలా..

Horoscope Today in Telugu (July 5, 2026): ఆదివారం మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి గ్రహాల సంచారం అనుకూల, ప్రతికూల ఫలితాలను అందించనుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, వివాహం, ఆరోగ్యం వంటి అంశాల్లో ఏ రాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

జూలై 5 రాశిఫలాలు: ఈ  రాశుల వారికి ఉద్యోగం, ధనలాభం..మీ రాశికి ఇలా..
Daily Horoscope 05 July 2026

Edited By:

Updated on: Jul 05, 2026 | 6:00 AM

దిన ఫలాలు (జూలై 5, 2026): మేష రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారంలో కొద్ది ప్రయత్నంతో అత్యధిక లాభాలు గడిస్తారు. మిథున రాశి వారు ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. స్నేహితుల వల్ల కొద్దిగా నష్టపోయే సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్య అవకా శాలున్నాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారంలో కొద్ది ప్రయత్నంతో అత్యధిక లాభాలు గడిస్తారు. వృత్తి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దాంపత్య జీవితం చాలావరకు సానుకూలంగా, హ్యాపీగా గడిచిపోతుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. కొందరు ప్రము ఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల్లో కొందరు బాగా సన్నిహితం అవుతారు. ముఖ్య మైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహా రాల్లో శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కూడా మెరుగ్గా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సమే తంగా ఆలయాల సందర్శన చేసుకుంటారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగు లకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. రుణ భారం తగ్గిం చుకునే ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పురోగతి చెందడం జరుగుతుంది. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారులకు అండగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఇతరులకు ఆర్థికంగా సాయం చేస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆస్తి వివాదం కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యకలాపాల్లో పాల్గొం టారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సాఫీగా పూర్తవుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు పురోగతి చెందుతాయి. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కొత్త ఉద్యోగాలు, కొత్త ఆదాయ మార్గాల గురించి చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు బాగా బిజీగా సాగు తాయి. రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులను తేలికగా పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. అద నపు ఆదాయ మార్గాలు సఫలం అవుతాయి. ఎక్కువగా దైవకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కాస్తంత ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. ఏ పని తలపెట్టినా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. కొందరు మిత్రులను ఆర్థికంగా ఆదు కుంటారు. ఆదాయానికి లోటుండదు కానీ, కొన్ని అనవసర ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించు కోవడం మంచిది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ, దైవ కార్యాల్లోనూ పాల్గొంటారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. ఇతరులకు చేసిన వాగ్దానాల కారణంగా ఇరకాటంలో పడతారు. లేనిపోని బాధ్యతలను నెత్తికెత్తుకోవడం జరు గుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆదాయానికి సంబంధించి కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో కొత్తగా పెట్టుబ డులు పెట్టడానికి, వ్యాపారాలు విస్తరించడానికి ఆలోచనలు సాగిస్తారు. ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. స్వల్పంగా అనారోగ్య సమస్యలుంటాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తవింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడ తారు. వ్యయ ప్రయాసలున్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. కుటుంబ బాధ్యతల విషయంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆదాయం బాగానే ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు నుంచి ఊహించని సమస్యలు తలెత్తుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఏ పని తలపెట్టినా సునాయాసంగా పూర్తవుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబసమేతంగా దైవకార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా కొందరు దూరపు బంధువుల్ని కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

Also Read: వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశులకు వారఫలాలు

Follow Us