జూలై 12 రాశిఫలాలు: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. మీ రాశికి ఎలా ఉందంటే..?

Horoscope Today (July 12, 2026): ఆదివారం 12 రాశుల వారికి గ్రహాల సంచారం మిశ్రమ ఫలితాలను అందించనుంది. కొందరికి ఆదాయం, ఉద్యోగాల్లో పురోగతి కనిపించగా, మరికొందరు ఖర్చులు, బాధ్యతల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు ఏ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం పరంగా మీ రాశి ఫలితాలను తెలుసుకోండి.

జూలై 12 రాశిఫలాలు: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. మీ రాశికి ఎలా ఉందంటే..?
Rashi Phalalu 12 July 2026

Edited By:

Updated on: Jul 12, 2026 | 6:00 AM

దిన ఫలాలు (జూలై 12, 2026): మేష రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయంలో అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు తప్పకపోవచ్చు. బాధ్యతలు మారే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. డబ్బును వృథా చేయవద్దు. ఆదాయంలో అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. బంధువుల నుంచి శుభ కార్యాల ఆహ్వానాలు అందు తాయి. తలపెట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా పురోగమిస్తాయి. చిన్నా చితకా ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని అధిగమిస్తారు. వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఫలితముంటుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు తప్పకపోవచ్చు. బాధ్యతలు మారే అవకాశం ఉంది. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు రాణిస్తారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులు మీ సలహాలు, సూచనలతో లబ్ది పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశముంది. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. పని భారంతో ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహా రాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో కొత్త బాధ్యతలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. తలపెట్టిన పనులన్నిటినీ వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రు లతో ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూ లంగా ఉంటుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాల క్షేపం చేయడం జరుగుతుంది. దైవ కార్యాల్లో కూడా పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటుండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఒక మోస్తరుగా సాగుతాయి. కుటుంబ సమేతంగా ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ప్రధాన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి. విద్యార్థులు చదువుల మీద బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగు తాయి. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో శుభ కార్యంలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. సర్వత్రా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారంలో బాగా బిజీ అవుతారు. ఆర్థిక సహాయాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రుల వల్ల నష్టాలకు గురవుతారు. కుటుంబపరంగా కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్త వుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ముఖ్య మైన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది మార్పులు, చేర్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యో గుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగు తాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సొంత పనులు మీద శ్రద్ద పెట్టాలి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఇంటా బయటా పలు కుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.

Also Read: వారఫలాలు..ఆ రాశుల వారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు, ఆకస్మిక ధన ప్రాప్తి..!

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఉన్న సూచనలు మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. వ్యక్తిగత విశ్వాసాన్ని బట్టి వీటిని అనుసరించవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us