AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: ఆ రాశుల వారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు, ఆకస్మిక ధన ప్రాప్తి..! 12 రాశులకు వారఫలాలు

వార ఫలాలు (జూలై 12-18, 2026): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యలో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మిథున రాశి వారికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా దాదాపు అన్ని రంగాల వారు శుభ ఫలితాలు పొందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 11, 2026 | 5:30 PM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ వారం ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.  దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. తలపెట్టిన ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని పురోగమిస్తారు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తండ్రి వైపు నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు చదువుల్లో మంచి ఫలితాలు గడిస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వారాంతంలో శుభ వార్తలు ఎక్కువగా వింటారు.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశివారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వారం మధ్యలో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధి కారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవ హారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగా లాభాలు అందుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ రాశివారికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా దాదాపు అన్ని రంగాల వారు శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు.  వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కా రమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాల్ని అనుసరిస్తారు. సోదరుల మీద విజయాలు సాధిస్తారు. సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యా ర్థులు పోటీ పరీక్షల్లో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మాట ఇవ్వడం మంచిది కాదు. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. ఊహించని అదృష్టం పడుతుంది.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూల ఫలితాలనిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవ హారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. తలపెట్టిన ప్రతి పనీ నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల సహకారంతో ప్రధాన బాధ్యతలను, లక్ష్యాలను పూర్తి చేస్తారు. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది పెడ తాయి. పెళ్లి ప్రయత్నాలకు, ప్రేమ వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆర్థిక విషయాల్లో ఈ వారం చాలావరకు మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగాలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగానే ఉన్నప్పటికీ, ఇతరులకు సహాయం చేయడం వల్ల బాగా ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి. పిల్లల చదువుల్లో కొద్దిపాటి పురోగతి ఉంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం బాగా ప్రశాంతంగా సాగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహంచని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో అనుభవజ్ఞుల సలహాలు కూడా తీసుకోవలసిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే, వృథా ఖర్చుల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా విశ్రాంతి లోపిస్తుంది. గతంలో మీ నుంచి ఆర్థికంగా సహాయం పొందినవారు ముఖం చాటేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. దీర్ఘకాలిక రుణాల విషయంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వారం మధ్యలో కొన్ని శుభవార్తలు వింటారు.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం కొన్ని శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలు పొందుతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. పెండింగ్ పనులు, వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. షేర్లు బాగా లాభిస్తాయి. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. బంధువులతో కలిసి దైవకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశివారికి ఈ వారమంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. కొద్ది శ్రమతో ఆర్థిక పరి స్థితి బాగా మెరుగుపడుతుంది. అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహా రాలు, పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువ రాబడి ఉంటుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యం జరిగే సూచనలున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తు లతో పరిచయాలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు అందుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల దాదాపు అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికారుల సహాయ సహకారాలుంటాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి సమయస్ఫూర్తిగా బయటపడతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బాకీలు, బకాయిలు వసూలవు తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.  ఆకస్మిక ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఒకటి రెండు ఆశించిన శుభవార్తలు వింటారు.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశివారికి వారం మధ్య నుంచి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధికి సంబం ధించి అనుకూలతలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలం ఉంటుంది. ఉద్యోగు లకు సాఫీగా సాగిపోతుంది. అధికారుల సహాయ సహకారాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. నిరుద్యోగుల ప్రయ త్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, ఒక పట్టాన చేతిలో డబ్బు నిలవదు. వారాంతంలో మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ వర్గాలతో పరిచ యాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహ కారం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇల్లు కొను గోలు ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం తలెత్తే అవ కాశం ఉంది. బంధువులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వామితో ఆల యాలు సందర్శిస్తారు. విద్యార్థులు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వకపోవడం చాలా మంచిది. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొం టాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, వ్యాపారాలే కాకుండా ఉద్యోగాలు కూడా ప్రోత్సాహకరంగగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులనుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదర వర్గంతో ఆస్తికి సంబంధించి రాజీ మార్గం అనుసరిస్తారు. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పిల్లల చదువులకు సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

12 / 12
Follow Us