Horoscope Today (11 మే 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమలో పడే సూచనలున్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశి వారికి కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ జీవితంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెంచుకునేందుకు ఆలోచన చేస్తారు. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఇబ్బందుల్లో ఉన్న బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా అనారోగ్యంతో అవస్థ పడే సూచనలున్నాయి. ఎంతో శ్రమ మీద ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చాలావరకు అనుకూలిస్తాయి. మిత్రుల వల్ల చిక్కుల్లో పడతారు. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళ్ళవు. ఆర్థిక లావాదేవీలు లాభంచకపోవచ్చు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంపాదన స్థిరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి, తిప్పట ఎక్కువగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. విదేశాల నుంచి ఆశించిన కబురు అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): చాలా కాలంగా పీడిస్తున్న ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. అదనపు సంపాదనకు సమయం అనుకూలంగా ఉంది. మొండి బాకీ ఒకటి అనుకోకుండా వసూలు అవుతుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక రంగాల్లో ఉన్నవారు బాగా బిజీ అవుతారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల కొద్దిగా నష్టపోతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ పరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు చదువుల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. సంతానం లేని వారు సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు అందుకుంటారు. సన్నిహితులను ఆర్థికంగా ఆదుకుంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. వివాహ ప్రయత్నాలు కాస్తంత అనుకూలంగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం చేస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ
సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. చిన్న వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే, ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. డబ్బు నష్టం జరుగుతుంది. బంధువులతో
విభేదాలు తలెత్తుతాయి. స్నేహితుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. వ్యక్తిగత జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): కొంచెం సహనంతో వ్యవహరిస్తే మీ లక్ష్యాలు నెరవేరే సూచనలు ఉన్నాయి. వృత్తి నిపుణులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరుస్నేహితులు అపార్ధాలతో దూరమయ్యే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. లాయర్లకు, డాక్టర్లకు, ఐటీ నిపుణులకు అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి.
పిల్లలు చదువులోనూ, ఉద్యోగ ప్రయత్నాలలోనూ విజయం సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆచితూచి మాట్లాడండి. కొన్ని ముఖ్యమైన పనులు బాగా ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది కానీ, మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండదు. ఆదాయపరంగా శుభవార్త వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. రుణ సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఎదురుచూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. బంధువుల రాకతో కుటుంబంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. సంతానయోగ సూచనలున్నాయి. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..