ఆగస్టు 9 రాశి ఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే రోజు!

Horoscope Today (August 09, 2026): ఆదివారం 12 రాశుల వారికి గ్రహాల ప్రభావం భిన్నంగా ఉండనుంది. మేష రాశి వారికి చేపట్టిన ప్రయత్నాల్లో విజయావకాశాలు కనిపిస్తే.. వృషభ రాశి వారికి కుటుంబపరంగా శుభకార్యాలు, ఉద్యోగంలో మంచి గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహం, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మరి మేషం నుంచి మీనం వరకు ఆదివారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఆగస్టు 9 రాశి ఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే రోజు!
Horoscope Today 09 August 2026

Edited By:

Updated on: Aug 09, 2026 | 6:00 AM

దిన ఫలాలు (ఆగస్టు 9, 2026): మేష రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రయత్నం తలపెట్టినా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రయత్నం తలపెట్టినా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థికాభివృద్ధి మార్గాలపై దృష్టి పెట్టడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా గడిచిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితం బాగా ఉత్సాహంగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు, లక్ష్యాలు అప్పగించే అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుం టారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని రంగాల వారికి సమయం యోగదాయకంగా ఉంది. చిన్ననాటి స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రముఖులతో స్నేహాల వల్ల కొన్ని ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవు తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశముంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. చేపట్టిన ప్రతి పనీ వ్యయప్రయాసలతో పూర్తవుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహనాలను వేగంగా నడపకపోవడం మంచిది. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన స్థాయిలో గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యక్తిగతంగా కొద్దిపాటి పురోగతి ఉంటుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంది. చిన్న నాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాలతో సంతృప్తికరంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహా రాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్య నుంచి ఉపశ మనం లభిస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలను పాటించడం మంచిది. పని భారం కాస్తంత ఎక్కు వగానే ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేస్తారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. సొంత నిర్ణయాలు, ఆలోచనల మీద ఆధా రపడడం చాలా మంచిది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి నిపుణులు అత్యధికంగా ప్రయోజనం పొందుతారు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. రావలసిన బాకీలు, బకాయిలు వసూలవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా, సంతృప్తికరంగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అను కోకుండా ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలు బాగా బిజీగా, తీరిక లేకుండా సాగుతాయి. వ్యాపారాల్లో కూడా కార్యకలాపాలు, లావాదేవీలు వృద్ధి చెందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయ త్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలకు తగ్గట్టుగా కొన్ని ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలలో జీవిత భాగ స్వామిని కూడా సంప్రదిస్తూ ఉండడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగుల మీద అదనపు బాధ్యతల భారం ఉంటుంది. వృత్తి జీవితం చాలావరకు సాఫీగా, సంతృ ప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాలలో కొద్దిగా లాభాలు పెరిగే సూచనలున్నాయి. వ్యయ ప్రయాస లతో కానీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయ్యే అవకాశం ఉండదు. వ్యక్తిగత జీవితంలో బాగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం కొద్దిగా పరవాలేదనిపిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ కుటుంబ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. శుభకార్యాలు, దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. గృహ, వాహనాల కొనుగోలుపై దృష్టి పెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

Weekly Horoscope: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. ఈ వారం పట్టిందల్లా బంగారమే!

Loading...
Unable to load recommendations.
Follow Us