ఆగస్టు 25 రాశిఫలాలు: ఈ రాశులకు ఆర్థికంగా ఢోకా ఉండదు.. మీ రాశి ఉందా?

దిన ఫలాలు (ఆగస్టు 25, 2026): మంగళవారం మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోండి. మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి అనుకూల సమయం కాగా, వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశాలున్నాయి. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ఆదాయ మార్గాలు విస్తరించే సూచనలు ఉన్నాయి. మరి మిగతా రాశుల వారికి మంగళవారం ఎలా ఉండబోతోందో చూద్దాం.

ఆగస్టు 25 రాశిఫలాలు: ఈ  రాశులకు ఆర్థికంగా ఢోకా ఉండదు.. మీ రాశి ఉందా?
Horoscope Today 25 August 2026

Edited By:

Updated on: Aug 25, 2026 | 6:00 AM

దిన ఫలాలు (ఆగస్టు 25, 2026): మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ది చెందు తాయి. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇష్టమైన వ్యక్తులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారు బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. కొందరు బంధు మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. మిత్రులతో ఆలయాలు సందర్శించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపా రాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో కూడా బాగా అనుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇష్టమైన బంధువులతో శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబంలో కొద్దిగా చికాకులు ఉంటాయి. పిల్లల నుంచి సమస్యలు ఎదురు కావచ్చు. జీవిత భాగస్వామి కూడా ఉద్యోగపరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల వాతావ రణం నెలకొంటుంది. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరడమే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. సంతా నానికి సంబంధించి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. ఆదాయ పరిస్థితి ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం సరదాగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. అధికారులు బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి లబ్ధి పొందు తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక విషయాలు సానుకూలంగా పురోగమిస్తాయి. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. పిల్లల నుంచి, సతీమణి నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇష్టమైన వ్యక్తులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. పెండింగు పనులు పూర్తవుతాయి. కొందరు సన్నిహి తుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. జీవిత భాగస్వా మితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటవుతుంది. లాభ దాయక స్నేహాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. దైవ కార్యాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కొద్దిపాటి వ్యయప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభి స్తాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగపరంగానే కాక, కుటుంబపరంగా కూడా బరువు బాధ్యతలు పెరుగుతాయి. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు వ్యయప్రయాసలతో గానీ పూర్తి కావు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు మిమ్మల్ని బాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థి తులుంటాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవ కార్యాల మీద ఖర్చు పెడతారు. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us