Telugu News Astrology Chandra Mangala Yoga November 2026: 6 Zodiac Signs Set to Experience Financial Growth
Money Astrology: చంద్ర మంగళ యోగంతో వీరికి డబ్బే డబ్బు! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Chandra Mangala Yoga: నవంబర్ 1, 2, 3 తేదీల్లో కర్కాటక రాశిలో కుజ, చంద్ర గ్రహాల కలయికతో చంద్ర మంగళ యోగం ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారికి ఆదాయ వృద్ధి అవకాశాలు కలగనున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలించడంతో పాటు ఆర్థికంగా ప్రయోజనం పొందే సూచనలు ఉన్నాయి.
నవంబర్ 1, 2, 3 తేదీల్లో కర్కాటక రాశిలో కుజ, చంద్ర గ్రహాల యుతి జరుగుతోంది. కర్కాటక రాశి కుజుడికి నీచ క్షేత్రం కాగా చంద్రుడికి స్వస్థానం. చంద్రుడి కలయికతో కుజుడికి ఈ మూడు రోజుల పాటు నీచభంగం కలిగింది. దీనివల్ల ప్రధానంగా ఆదాయ వృద్ధి కలుగుతుంది. అదనపు ఆదాయా నికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయాన్ని లాభసాటి వ్యవహారాల్లో మదుపు చేయడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల చంద్ర మంగళ యోగమనే మహా భాగ్య యోగం ఏర్పడుతోంది. మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశులవారికి ఈ మూడు రోజుల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం సక్సెస్ అవుతాయి.
మేషం: రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానాధిపతి చంద్రుడితో చతుర్థ స్థానంలో కలవడం వల్ల ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. కుజుడు భూ కారకుడైనందువల్ల తప్పకుండా భూలాభం కలుగుతుంది. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి లాభాలు వృద్ధి చెందు తాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆదాయం బాగాపెరిగే అవకాశం ఉంది.
మిథునం: ఈ రాశికి ధన స్థానంలో ఈ చంద్ర, మంగళ యోగం ఏర్పడడం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. రియల్ ఎస్టేట్, లిక్కర్ వంటి వ్యాపారాలు బాగా రాణిస్తాయి. శుభవార్తలు వింటారు.
కర్కాటకం: ఈ రాశిలో రాశినాథుడు చంద్రుడితో దశమాధిపతి కుజుడికి యుతి జరిగినందువల్ల ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్ని పొందడం జరుగుతుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. గౌరవమర్యాదలకు లోటుండదు.
తుల: దశమ స్థానంలో ధన, సప్తమాధిపతి కుజుడు, దశమాధిపతి చంద్రుడు కలవడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి సాధిస్తాయి. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా విదేశాలు వెళ్లే అవకాశం ఉంది. మంచి పరిచయాలు కలుగుతాయి. దాంపత్యంలో అన్యోన్యత బాగాపెరుగుతుంది.
మకరం: ఈ రాశికి సప్తమంలో చతుర్థ, లాభ, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల సంపన్న కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. భూ లాభం కలుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసివస్తాయి. రావలసిన సొమ్ము వసూలవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి.
మీనం: ఈ రాశికి ధన, భాగ్య, పంచమ స్థానాల అధిపతుల యుతి జరుగుతున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. సమ ర్థతకు, ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వారసత్వ ఆస్తి సంక్రమిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. రావలసిన డబ్బు, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. గృహ యోగం కలుగుతుంది.