మకర రాశి వార్షిక ఫలితాలు 2026: కొత్త సంవత్సరంలో ఆదాయ వృద్ధి, ఉద్యోగ పదోన్నతులు

Capricorn Horoscope 2026: మకర రాశి వారికి 2026లో ఆదాయ వృద్ధి, పదోన్నతులు, వ్యాపార లాభాలతో పాటు కోరికలు నెరవేరుతాయి. శని సంచారం, రాహువు స్థానం శుభకార్యాలకు దారి తీస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. రాజపూజ్యాలు, శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంటుంది, ఏడాది పొడవునా సంతృప్తికరంగా ఉంటుంది.

మకర రాశి వార్షిక ఫలితాలు 2026: కొత్త సంవత్సరంలో ఆదాయ వృద్ధి, ఉద్యోగ పదోన్నతులు
Makara Rashi Horoscope 2026

Edited By:

Updated on: Dec 29, 2025 | 3:22 PM

Makara Rashi 2026: మకర రాశి వారికి 2026 సంవత్సరమంతా చాలావరకు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయం వృద్ధి చెందడం, ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడంతో పాటు మనసులోని కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. రాశినాథుడైన శనీశ్వరుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తుండడం, ధన స్థానంలో రాహువు ఉండడం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం కూడా బాగా నిలకడగా సాగిపోతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఏడాదంతా సంతృప్తికరంగా, బాగా అనుకూలంగా సాగిపోతుంది.

ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు

ఏడాదంతా వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరగడంతో పాటు రాబడి దిన దినాభివృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల విస్తరణకు అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారంతో పాటు, మనసులోని కొన్ని కోరికలు అనుకోకుండా నెరవేరడం కూడా జరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కొందరు బంధు మిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం కూడా జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా కొద్దిగా బరువు బాధ్యతలు పెరగడం, ఒత్తిడి ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి.

ప్రేమలు, పెళ్లిళ్లు, పిల్లలు

శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉంది. అనుకోకుండా బంధువర్గంలోని వారితో ప్రేమలో పడే అవకాశం ఉంది. ప్రేమ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. జూలై తర్వాత ఆశించిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సమస్యలు, అపార్థాలు చాలావరకు తగ్గిపోతాయి. బుధ, శుక్రుల అనుకూల సంచారం వల్ల మానసిక ప్రశాంతతకు లోటుండదు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం కూడా ఉంది. ఏప్రిల్ తర్వాత నుంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. కుటుంబంలో అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

అనుకూల పరిస్థితులు

ఈ రాశివారికి మొదటి ఆరు నెలల కంటే ఆ తర్వాత ఆరు నెలలు ఉజ్వలంగా, వైభవంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. సంతాన యోగం కలుగుతుంది. విదేశీయాన యోగం, విదేశీ సంపాదన యోగం కూడా కలుగుతాయి.

అనుకూల నెలలు

ఈ రాశివారికి ఈ ఏడాదంతా అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోయే అవకాశం ఉన్నప్పటికీ, జూలై నుంచి డిసెంబర్ వరకు మాత్రం జీవితం మరింత వైభవంగా సాగిపోయే అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. అవార్డులు, రివార్డులు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మీద మాత్రం ఏడాదంతా కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతర విషయాలన్నీ సానుకూలంగా సాగిపోతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.