Kala Sarpa Yoga: కాలసర్ప యోగం.. వారు ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!

Telugu Astrology: ఏప్రిల్ 27 నుండి మే 11 వరకు కాలసర్ప యోగం ఏర్పడుతోంది. రాహువు, కేతువుల మధ్య అన్ని గ్రహాల సంచారం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. కాలసర్ప దోషం కారణంగా కొన్ని రాశుల వారు ఉద్యోగం, ఆర్థికం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశుల వారు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది. కాలసర్ప యోగం ప్రభావం వివరంగా తెలుసుకుందాం.

Kala Sarpa Yoga: కాలసర్ప యోగం.. వారు ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
Kalasarpa Yoga

Edited By: Janardhan Veluru

Updated on: Apr 23, 2025 | 2:45 PM

ఈ నెల 27 నుంచి మే 11 వరకు గ్రహ సంచారంలో కాలసర్ప యోగం ఏర్పడుతోంది. గ్రహాలన్నీ రాహు కేతువుల మధ్య సంచారం చేస్తున్నప్పుడు కాల సర్ప యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న రాహువుకు, కన్యారాశిలో ఉన్న కేతువుకు మధ్య గ్రహ సంచారం జరుగు తోంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి కొన్ని రకాల కష్టనష్టాలు కలుగుతాయి. మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మీన రాశులవారు వృత్తి, ఉద్యోగాల్లోనూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ రాశుల వారు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం చాలా మంచిది.

  1. మేషం: ఈ రాశికి షష్ట, వ్యయ స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల కాలసర్ప యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఆదాయం కంటే ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగంలో పొరపాట్లు జరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లదే పైచేయి అవుతుంది. ప్రయాణాల వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.
  2. మిథునం: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో కాలసర్ప యోగం ఏర్పడుతున్నందువల్ల, ఉద్యోగ సంబంధ మైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. నిరుద్యోగులకు ఆశాభంగాలు కలుగుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు, పత్రాలను పోగొట్టుకునే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలేవీ చేపట్టకపోవడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల సమస్యలు తలెత్తుతాయి.
  3. సింహం: ఈ రాశికి ద్వితీయ, అష్టమ స్థానాల్లో కాలసర్ప యోగం ఏర్పడుతున్నందువల్ల ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులతో బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందకపోవచ్చు. డబ్బు ఇవ్వాల్సినప్పుడు బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సంబంధమైన చికాకులు ఉంటాయి. బంధుమిత్రులతో అకారణ విభే దాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలకు, ధనపరమైన వాగ్దానాలకు దూరంగా ఉండడం మంచిది.
  4. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ రాహుకేతువుల యోగం ఏర్పడుతున్నందువల్ల వైవాహిక జీవి తంలో సమస్యలు తలెత్తుతాయి. దంపతుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవ హారాల్లో అసంతృప్తికి బాగా అవకాశం ఉంది. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల ఇబ్బందులుంటాయి. విదేశీయానానికి ఆటంకాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేయాల్సి ఉంటుంది. అపనిందలు వచ్చే అవకాశం ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో కాలసర్ప యోగం ఏర్పడినందువల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. మనశ్శాంతి తగ్గుతుంది. ఏ ప్రయత్నమూ ఒక పట్టాన నెరవేరక ఇబ్బంది పడ తారు. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో కలిసి రాకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. సొంత ఇంటి ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాల్లో చిక్కుముడులు తప్పకపోవచ్చు. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు.
  6. మీనం: ఈ రాశిలో కాలసర్ప యోగం ఏర్పడుతున్నందువల్ల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పెళ్లి సంబంధాలు చివరి క్షణంలో వెనక్కు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు కలుగుతాయి. కొందరు మిత్రులు, సన్నిహితులు దూరమవుతారు. ఆదాయం తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది.