Zodiac Sign: మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం, అన్నీ శుభశకునాలే

Makara Rashi Rajayoga: మకర రాశిలో మూడు రాజయోగాలు ఏర్పడటంతో కొన్ని రాశులకు అదృష్టం పట్టనుంది. మకరరాశిలో బుధుడు, సూర్యుడు కలిసి ఉండటం వల్ల బుధాదిత్య రాజయోగం, బుధుడు, కుజుడు కలిసి ఉండటం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది. మకరరాశిలో కుజుడు సంచారం వల్ల రుచక రాజయోగం కూడా ఏర్పడుతోంది.

Zodiac Sign: మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం, అన్నీ శుభశకునాలే
3 Rajayogas in Capricorn

Updated on: Jan 19, 2026 | 11:25 AM

జ్యోతిష్యవాస్త్రం ప్రకారం ప్రతీ గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మార్చుకుంటుంది. ఇలా గ్రహాలు తమ రాశులను మార్చుకున్నప్పుడు కొన్నిసార్లు రాజయోగాలు ఏర్పడతాయి. ఈ రాజయోగాలు కొన్ని రాశులకు సానుకూల ఫలితాలను అందిస్తాయి. తాజాగా ఒకే రాశిలో మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. గ్రహాల గమన మార్పుల కారణంగా మకర రాశిలో మూడు రాజయోగాలు ఏర్పడటంతో కొన్ని రాశులకు అదృష్టం పట్టనుంది. మకరరాశిలో బుధుడు, సూర్యుడు కలిసి ఉండటం వల్ల బుధాదిత్య రాజయోగం, బుధుడు, కుజుడు కలిసి ఉండటం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది.

మకరరాశిలో కుజుడు సంచారం వల్ల రుచక రాజయోగం కూడా ఏర్పడుతోంది. ఈ మూడు రాజ యోగాలు 100 సంవత్సరాల తర్వాత ఒకసారిలో ఏర్పడతాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఒకే రాశిలో మూడు రాజయోగాలు ఏర్పడటంతో కొన్ని రాశులకు సానుకూల ఫలితాలతోపాటు అదృష్టం కలిసి వస్తుంది.

మకర రాశి

మకరరాశిలో ఏర్పడిన ఈ మూడు రాజయోగాలు ఈ రాశివారికి చాలా సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాబోయే కొన్ని నెలలపాటు శుభకార్యాలు జరుగుతాయి. మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు నగలు, ఇల్లు లేదా వాహనం కొనే అవకాశం ఉంది. అవివాహితులకు త్వరలో మంచి సంబంధం దొరుకుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు కొద్ది రోజుల్లోనే శుభవార్త వింటారు. లక్ష్మీనారాయణ యోగం కారణంగా మకరరాశివారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి.

వృషభం

వృషభ రాశి 9వ ఇంట్లో ఈ మూడు రాజయోగాలు ఏర్పడతాయి. దీంతో పట్టిందల్లా బంగారం అవుతుందన్నట్లుగా వృషభ రాశి వారి జీవితం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మీ కెరీర్‌లో ఊహించని పురోగతిని పొందుతారు. మీరు ఉమ్మడి వ్యాపారంలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి సమస్యలు తొలగిపోతాయి. మీరు పనిచేసే చోట సానుకూల ఫలితాలు పొందుతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు అనుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

మీన రాశి

ఈ రాశిలో 11వ ఇంట్లో మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా మీరు చేపట్టిన ప్రతీ పని విజయవంతమవుతుంది. మీకు అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. మీ కెరీర్‌లో పురోగతి చూస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉమ్మడి వ్యాపారాల నుంచి సమస్యలు తొలగిపోతాయి. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. నూతన వధూవరులకు సంతానం గురించి శుభవార్త వింటారు. బంధువులు మీ ఇంటికి వస్తారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది.

Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు.