రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ కాంగ్రెస్ నేతలతో పాటు నేషనల్ హెరాల్డ్ పత్రికలపై పరువు నష్టం కేసును దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ డిఫమేషన్ కేసులను వెనక్కి తీసుకోవాలని అనిల్ అంబానీ నిర్ణయించుకున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అనిల్ అంబానీకి మోదీ సాయం చేశారని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించగా.. అనిల్ దీన్ని సీరియస్ గా తీసుకుని.. కాంగ్రెస్ నేత రాహుల్‌తో పాటు నేషనల్ హెరాల్డ్‌పై 5 వేల కోట్ల విలువైన పరువు నష్టం కేసు వేశారు. అహ్మదాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో ఆ దావాలు దాఖలు చేయగా.. వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు అనిల్ తరపున న్యాయవాది రాకేష్ పారిక్ ఇవాళ మీడియాతో తెలిపారు.
Breaking News
- తూర్పుగోదావరి: రైతు సదస్సులో జనసేన కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీకు క్రమశిక్షణ లేదంటూ కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయానన్న పవన్
- ఢిల్లీ అగ్నిప్రమాదంపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు. ఫ్యాక్టరీ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. పరారీలో ఫ్యాక్టరీ యజమాని. వారం రోజుల్లో విచరాణ పూర్తి చేయాలని ఆదేశాలు
- అమరావతి: ఈ నెల 23 నుంచి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన. మూడు రోజులపాటు పర్యటించనున్న వైఎస్ జగన్. జమ్మలమడుగు, పులివెందుల, కడప, మైదుకూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న జగన్
- అనంతపురం: సాకే పవన్ చేసిన వ్యాఖ్యలకు జనసేన మద్దతు. సాకే వ్యాఖ్యలను సమర్థించిన అనంతపురం జనసేన నేతలు. రెడ్డి సంఘం నేతలపై జనసేన నేతల ఆగ్రహం
- భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
- మాజీ ఎంపీ కవితకు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం. ఐఎస్బీలో ఇండియన్ డెమక్రసీ ఎట్ వర్క్ సదస్సుకు ఆహ్వానం. జనవరి 9, 10 తేదీలలో జరగనున్న సదస్సు. మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ అంశంపై ప్రసంగించనున్న కవిత
- తూ.గో:జనసేన రైతు సదస్సును ముట్టడించిన ఎమ్మార్పీఎస్. పవన్ రైతు సదస్సులోకి చొచ్చుకొచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు. అడ్డుకున్న జన సైనికులు, ఇరువురి మధ్య తోపులాట. సమస్యలపై పవన్‌తో మాట్లాడాలంటూ వాగ్వాదం