YCP third list release postponed: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా మార్పులు చేర్పులు చేస్తూ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులనే బరిలోకి దించుతూ.. గ్రాఫ్ సరిగా లేని సిటింగ్‌లను పక్కన పెడుతున్నారు. సర్వే అంచనాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ ఇన్‌ఛార్జులను మారుస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 11మంది.. 27మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసిన సీఎం జగన్.. మూడో జాబితాలో దాదాపు 29 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తారంటూ ప్రచారం జరిగింది. మొత్తం 29మందితో వైసీపీ మూడో జాబితా రెడీ అయిందని.. రాత్రి నాటికి విడుదల అవుతుందంటూ చర్చ జరుగుతుండటంతో.. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ క్యాంప్ ఆఫీసులో భేటీ అయ్యారు. అంతేకాకుండా.. నియోజకవర్గ ఇన్చార్జులతో కూడా సీఎం జగన్ భేటీ అవుతున్నారు. అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుని.. అభ్యర్థులను మారుస్తున్నారు. ఈ తరుణంలో మూడో జబితా ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు వైసీపీ నేతలు ప్రకటించారు.
మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పుపై స్పష్టత రాకపోవడంతో.. మూడో జాబితా విడుదలను వాయిదా వేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. విడుదలను వాయిదా వేస్తున్నామని.. సీఎం జగన్ త్వరలోనే విడుదల చేస్తారని ప్రకటించింది. ఇదిలాఉంటే.. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చినట్లు వస్తున్న వార్తలతో పలువురు ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. సీటు కన్ఫామా..? లేదా..? అంటూ పార్టీ పెద్దలను ఆరాతీస్తున్నట్లు సమాచారం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..