Sampoornesh and Jogi Ramesh: సంపూర్ణేశ్‌బాబుతో కలిసి జుంబా డ్యాన్స్‌ చేసిన ఎమ్మెల్యే జోగి రమేశ్‌.. వైరలవుతోన్న వీడియో..

|

Jan 03, 2022 | 1:28 PM

ఒకాయన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటుడు. ఇంకొకాయన ఎప్పుడూ బిజీగా ఉండే ప్రజాప్రతినిధి. భిన్నరంగాలకు చెందిన వీరిద్దరూ ఒకచోట కలిశారు. ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేసి యువతలో జోష్‌ నింపారు.

Sampoornesh and Jogi Ramesh: సంపూర్ణేశ్‌బాబుతో కలిసి జుంబా డ్యాన్స్‌ చేసిన ఎమ్మెల్యే జోగి రమేశ్‌..  వైరలవుతోన్న వీడియో..
Sampoornesh And Jogi Ramesh
Follow us on

ఒకాయన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటుడు. ఇంకొకాయన ఎప్పుడూ బిజీగా ఉండే ప్రజాప్రతినిధి. భిన్నరంగాలకు చెందిన వీరిద్దరూ ఒకచోట కలిశారు. ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేసి యువతలో జోష్‌ నింపారు. వారే టాలీవుడ్‌ హీరో సంపూర్ణేశ్‌ బాబు, వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌. విజయవాడ శివార్లలోని ఇబ్రహీం పట్నం వద్ద ఆదివారం జుంబా డే కార్యక్రమం జరిగింది. ఫిట్‌నెస్‌, ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో భాగంగా తేజాస్ ఎలైట్ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. టాలీవుడ్ హీరో సంపూర్ణేశ్ బాబు, ఎమ్మెల్యే జోగి రమేశ్ అతిథులుగా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా యువతలో జుంబా డ్యాన్స్ పట్ల అవగాహన పెంచేందుకు ఎమ్మెల్యే జోగి రమేశ్, హీరో సంపూ వేదికపై ఉత్సాహంగా కాలు కదిపారు. ఆ తర్వాత నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

‘ఉ అంటావా మావా’ అంటూ..
కాగా ఇలాంటి ఫిట్ నెస్ కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటుచేయాలని నిర్వాహకులను కోరారు సంపూర్ణేశ్‌, జోగి రమేవ్‌. అదేవిధంగా జుంబా డ్యాన్స్ వంటి ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజులు జీవనశైలిలో భాగం చేసుకోవాలని యువతకు సూచించారు. కాగా ఈ ప్రోగ్రాంలో పలు పాటలకు జుంబా డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు జిన్ రమ్యా టీం మెంబర్స్‌. యువత కూడా ఉత్సాహంగా వారితో కాలు కదిపారు. ముఖ్యంగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ‘పుష్ప’ సినిమాలోని సమంత స్పెషల్‌ సాంగ్‌ ‘ఉ అంటావా మావా’ కు యువత వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి.

Also Read:

Mukku Avinash: బుల్లితెర కమెడియన్ అవినాశ్‌ ఇంటిని చూశారా? .. థీమ్‌ పోస్టర్స్‌ తో గదులను ఎంత బాగా అలంకరించారో..

John Abraham: బాలీవుడ్‌ను వదలని కరోనా.. వైరస్‌ బారిన స్టార్‌ హీరో దంపతులు.. జెర్సీ హీరోయిన్‌కు కూడా పాజిటివ్‌..

Director PCReddy: ప్రముఖ సీనియర్‌ దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం..