వైఎస్సార్ అచీవ్ మెంట్, లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుల ప్రకటన
లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు గెలుచుకున్నవారికి 10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందిస్తారు. వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతలకు 5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందిస్తారు. నవంబర్ ఒకటో తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు సీఎం జగన్ చేతులమీదుగా అవార్డుల బహుకరణ ఉంటుంది.
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులైన వైఎస్సార్ అచీవ్ మెంట్, వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడో ఏడాది ఈ అవార్డులను అందిస్తుంది ప్రభుత్వం. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్, జి.వి.డి.కృష్ణమోహన్‌తో పాటు ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి, వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు సభ్యులుగా ఉన్నారు. నేరుగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు.. జిల్లాల్లో కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం ద్వారా ఎంపిక చేసిన నామినేషన్లను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తరవాత తుది జాబితా సిద్దం చేస్తుంది. ఈ ఏడాది
27 అవార్డుల్ని సిఫారసు చేసి, ముఖ్యమంత్రి ఆమోదం మేరకు కమిటీ పంపింది. వైయస్సార్ అవార్డుల్లో 23 లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డులు, 4 ఎచీవ్‌మెంట్ అవార్డులు ఉన్నాయి. లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు గెలుచుకున్నవారికి 10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందిస్తారు. వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతలకు 5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందిస్తారు. నవంబర్ ఒకటో తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు సీఎం జగన్ చేతులమీదుగా అవార్డుల బహుకరణ ఉంటుంది.
2023లో వైయస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, ఎచీవ్‌మెంట్ అవార్డులకు ఎంపిక అయిన వారి వివరాలివే
–వ్యవసాయం
శ్రీమతి పంగి వినీత– (ఎచీవ్‌మెంట్ అవార్డు)
శ్రీ వై.వి.మల్లారెడ్డి– అనంతపురం జిల్లా
–ఆర్ట్ అండ్ కల్చర్
యడ్ల గోపాలరావు– రంగస్థల కళాకారుడు– శ్రీకాకుళం జిల్లా
తలిసెట్టి మోహన్– కలంకారీ– తిరుపతి జిల్లా
కోట సచ్చిదానంద శాస్త్రి– హరికథ– బాపట్ల జిల్లా
కోన సన్యాసి– తప్పెటగుళ్ళు– శ్రీకాకుళం జిల్లా
ఉప్పాడ హ్యాండ్ లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ– కాకినాడ జిల్లా
ఎస్.వి.రామారావు– చిత్రకారుడు– కృష్ణా జిల్లా
శ్రీమతి రావు బాల సరస్వతి– నేపథ్య గాయని– నెల్లూరు జిల్లా
తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు– ప్రకాశం జిల్లా
చింగిచెర్ల కృష్ణారెడ్డి– జానపద కళలు– అనంతపురం జిల్లా
శ్రీమతి కలీసాహెబీ మహబూబ్– షేక్ మహబూబ్ సుబానీ దంపతులకు– నాదస్వరం– ప్రకాశం జిల్లా
–తెలుగు భాష– సాహిత్యం
ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం– పశ్చిమ గోదావరి జిల్లా
ఖదీర్ బాబు– నెల్లూరు జిల్లా– (ఎచీవ్‌మెంట్ అవార్డు)
శ్రీమతి మహెజబీన్– నెల్లూరు జిల్లా (ఎచీవ్‌మెంట్ అవార్డు)
నామిని సుబ్రహ్మణ్యం నాయుడు– చిత్తూరు జిల్లా
అట్టాడ అప్పలనాయుడు– శ్రీకాకుళం జిల్లా
–క్రీడలు
పుల్లెల గోపీచంద్– గుంటూరు జిల్లా
శ్రీమతి కరణం మల్లీశ్వరి– శ్రీకాకుళం జిల్లా
–వైద్యం
ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం– ఎన్టీఆర్ జిల్లా
ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్‌టీ– కాక్లియర్ ఇంప్లాంట్స్– వైయస్సార్ జిల్లా