AP New Cabinet: ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణతో అసమ్మతి సెగలు.. సుచరిత బాటలో గిద్దలూరు ఎమ్మెల్యే..

|

Apr 11, 2022 | 9:16 AM

ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ అసమ్మతి సెగలు రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుచరిత, కోటంరెడ్డి, ఉదయభాను, శిల్పా చక్రపాణి, బాలేనేని అనుచరులు తమ నేతకు మంత్రి పదవి..

AP New Cabinet: ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణతో అసమ్మతి సెగలు.. సుచరిత బాటలో గిద్దలూరు ఎమ్మెల్యే..
Nirasana
Follow us on

ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ(AP New Cabinet) అసమ్మతి సెగలు రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుచరిత, కోటంరెడ్డి, ఉదయభాను, శిల్పా చక్రపాణి, బాలేనేని అనుచరులు తమ నేతకు మంత్రి పదవి దక్కకపోవడంపై రోడ్డెక్కారు. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యలకు యత్నించారు. ఎమ్మెల్యే సుచరిత రాజీనామ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని మోపీదేవికి అందజేసినట్లు చెప్పారు. నంద్యాల జిల్లాలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి అనుచరులు ఏకంగా రాజీనామాలకు దిగారు. తమ నేతకు మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడంపై మనస్తాపంతో ఐదుగురు వార్డు కౌన్సిలర్లు రాజీనామా చేస్తూ మున్సిపల్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. మరికొందరు రాజీనామా చేసేయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు ఉదయభాను అనుచరులు ఆగ్రహంతో నేషనల్ హైవే 65 పై ముల్లపాడు వద్ద పెట్రోల్‌ పోసి బైకును తగలబెట్టారు. బైకుపై పెట్రోల్ పోస్తుండగా ఓ కార్యకర్తపై పెట్రోల్‌ పడడంతో మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన కార్యకర్తలు అక్కడి నుంచి పరుగులుబెట్టారు

గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితకు కేబినెట్‌లో బెర్త్‌ దక్కకపోవడంపై రగిలిపోయారు. నిరసనగా ఆమె అనుచరులు, అభిమానులు రోడ్డెక్కారు. మనస్తాపంతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు సైతం రాజీనామాలకు సిద్ధమయ్యారు.

ప్రకాశం జిల్లాలో మంత్రివర్గంలో బెర్త్‌ దొరక్కపోవడంపై ఫైరవుతున్నారు మాజీ మంత్రి బాలినేని, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. వారి అనుచరులు సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఏకంగా పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.

మరోవైపు పల్నాడు జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యే పిన్నెల్లికి కేబినెట్‌లో బెర్త్‌ దక్కకపోవడంపై అనుచరులు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఓ మహిళా కార్యకర్త మంటల్లో దూకి ఆత్మహత్యకు యత్నించడంతో కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. తన పేరును కనీసం పరిశీలనలోకి తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ 26మంది కార్పొరేటర్లు, 18 మంది సర్పంచులు, 12 మంది MPTCలు తమ పదవులను త్యాగం చేయడానికి రెడీ అయ్యారు.

ఇవి కూడా చదవండి: Jagan Cabinet 2.0: ఒక్కప్పుడు ఆ పార్టీలో.. ఇప్పుడు అనూహ్యంగా మంత్రివర్గంలోకి.. కల్యాణదుర్గం ఎమ్మెల్యే..

Jagan Cabinet 2.0: మాటల మాంత్రికుడికి గుర్తింపు.. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అంబటి..